ఎస్బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, పోస్టాఫీసు టైం డిపాజట్‌.. ఎక్కువ ఆదాయం దేని నుంచి లభిస్తుందంటే..?

SBI FD vs Post Office: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌ ఈ రెండు పథకాలలో ఏది ఎక్కువ రాబడి అందిస్తుంది. కస్టమర్లు ఈ రెండింటిలో ఎక్కడ ఎక్కువ

ఎస్బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, పోస్టాఫీసు టైం డిపాజట్‌.. ఎక్కువ ఆదాయం దేని నుంచి లభిస్తుందంటే..?
Small saving Schemes
Follow us
uppula Raju

|

Updated on: Apr 04, 2022 | 4:23 PM

SBI FD vs Post Office: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌ ఈ రెండు పథకాలలో ఏది ఎక్కువ రాబడి అందిస్తుంది. కస్టమర్లు ఈ రెండింటిలో ఎక్కడ ఎక్కువ ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి. వాస్తవానికి ఈ రెండూ కూడా మంచి పథకాలే. రెండింటికి ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర బ్యాంకులు ఎఫ్డీలని, పోస్టాఫీసులు టైమ్ డిపాజిట్ పథకాలని అమలు చేస్తాయి. రెండింటిలో డబ్బుకు పూర్తి భద్రత, హామీ ఉంటుంది. కానీ కస్టమర్ ఎక్కువ రాబడి ఎక్కడ వస్తుందో అక్కడే పెట్టుబడి పెడతాడు. దీని ప్రకారం రెండు పథకాలను సరిపోల్చడం అవసరం. SBI FD, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) రాబడిని అంచనా వేయాలంటే సమాన కాలవ్యవధి తీసుకొని పోల్చాల్సి ఉంటుంది. మీరు 5 సంవత్సరాల పాటు రెండు పథకాలలో సమాన మొత్తాన్ని డిపాజిట్‌ చేస్తే ఎక్కడ ఎక్కువ రాబడిని వస్తుందో తెలుస్తుంది. మీరు వడ్డీ రేట్లు, కాలవ్యవధి మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తే దాదాపు 1.3 శాతం తేడా స్పష్టంగా కనిపిస్తుంది. SBI FDపై వడ్డీ 5.4%, పోస్ట్ ఆఫీస్ TDపై 6.7% వడ్డీ లభిస్తుంది. వీటి ప్రకారం ఆదాయాలలో వ్యత్యాసం 1.3 శాతం అవుతుంది. అంటే మీరు పోస్టాఫీసు TD నుంచి ఎక్కువ సంపాదించవచ్చు.

1 లక్ష రూపాయలపై ఎంత లాభం

ఎస్‌బిఐ ఎఫ్‌డిలో, పోస్టాఫీస్ టిడిలో 5 సంవత్సరాల పాటు లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే స్టేట్ బ్యాంక్ వడ్డీగా రూ.64,362 ఇస్తుంది. స్టేట్ బ్యాంక్ చివరలో మొత్తం రూ.1,64,362 అవుతుంది. మరోవైపు 5 సంవత్సరాలలో పోస్టాఫీసు TDలో 2,00,016 రూపాయలు అవుతాయి. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌లో లక్ష రూపాయలు 2 లక్షలకు పైగా రెట్టింపు అవ్వడం మనం గమనించవచ్చు. అలాగే స్టేట్ బ్యాంక్ FD నుంచి మనకు 1 లక్ష 65 వేల కంటే తక్కువే వచ్చింది.

ఎన్ని రోజులకు డబ్బులు జమ చేస్తారు

స్టేట్ బ్యాంక్ FDల కాలవ్యవధి పెట్టుబడి అవసరాన్ని బట్టి ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పోస్టాఫీసు TD పథకాలు ఒక సంవత్సరం, రెండు, మూడు లేదా ఐదు సంవత్సరాలు ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి SBI FD ఖాతాను సులభంగా ఆన్‌లైన్‌లో ఓపెన్‌ చేయవచ్చు. అయితే పోస్టాఫీసులో TD ఖాతాను తెరవడానికి కచ్చితంగా పోస్టాఫీసు శాఖను సందర్శించాలి. సాధారణ ప్రజలకు SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు 2.90% నుంచి 5.40% మధ్య ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ TD వడ్డీ రేట్లు 5.50% నుంచి 6.70% వరకు ఉంటాయి.

E Shram Card: విద్యార్థులు ఈ శ్రమ్‌ కార్డుని పొందగలరా.. కార్డుకి సంబంధించి ముఖ్య నియమాలు..!

Health News: అర్ధరాత్రి భోజనం చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Coffee: కాఫీతో ప్రయోజనాలు అనేకం.. చర్మం, జుట్టు సమస్యలు తొలగించడంలో సూపర్..!

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..