E Shram Card: విద్యార్థులు ఈ శ్రమ్‌ కార్డుని పొందగలరా.. కార్డుకి సంబంధించి ముఖ్య నియమాలు..!

E Shram Card: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వాటిలో ఒకటి E-Shram కార్డ్ పథకం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న

E Shram Card: విద్యార్థులు ఈ శ్రమ్‌ కార్డుని పొందగలరా.. కార్డుకి సంబంధించి ముఖ్య నియమాలు..!
E Shram Card
Follow us
uppula Raju

|

Updated on: Apr 03, 2022 | 7:26 PM

E Shram Card: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వాటిలో ఒకటి E-Shram కార్డ్ పథకం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజల కోసం 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దేశంలో పనిచేసే వ్యక్తులు ముఖ్యంగా 2 రంగాలలో పనిచేస్తున్నారు. మొదటి రంగం అసంఘటిత రంగం. ఇందులో పనిచేసేవారు రోజూ సంపాదించి తినే వారే. అంటే రోడ్డుపై పనిచేసే కార్మికులు, నిర్మాణ పనులు చేసే కార్మికులు, ఇళ్లలో పనిచేసేవారు, వలస కార్మికులు, పొలాల్లో పని చేసే వాళ్ళు మొదలైనవారు ఇందులోకి వస్తారు. మరోవైపు సంఘటిత రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రతి నెలా స్థిర జీతం పొందుతారు. వారికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. అందులో ప్రతి నెలా డబ్బు జమ అవుతుంది. కరోనా మహమ్మారి సమయంలో దేశంలోని కోట్లాది మంది కూలీల ఉపాధి పోయింది. వారు తిరిగి తమ ఇళ్లకు వెళ్ళవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ-శ్రామిక్‌ పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ-శ్రామిక్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 26 కోట్ల మందికి పైగా కూలీలు ఈ పథకంలో చేరారు. దేశంలోని 38 కోట్ల మంది కార్మికులు ఈ ప్రభుత్వ పథకంలో నమోదు కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

విద్యార్థులు ఈ శ్రమ్‌ కార్డు పొందవచ్చా..?

ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఒక విద్యార్థి 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి అసంఘటిత రంగంలో పనిచేస్తుంటే అతడు ఈ-శ్రమ్ కార్డుకి అర్హుడవుతాడు. ఈ-శ్రామిక్ పోర్టల్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి 16 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి, అసంఘటిత రంగంలో పనిచేస్తుంటే అతను ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. కానీ పెన్షన్ పొందుతున్న వ్యక్తి లేదా EPFO ​​సభ్యుడు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేడని గుర్తుంచుకోండి. కొన్ని రాష్ట్రాల్లో e- shram పథకం కింద నెలకి 500 నుంచి 1000 రూపాయలు చెల్లిస్తు్న్నారు. ఈ కార్డు ద్వారా రూ.2 లక్షల బీమా లభిస్తుంది. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షలు, వికలాంగులైతే రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తుంది.

Health News: అర్ధరాత్రి భోజనం చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Coffee: కాఫీతో ప్రయోజనాలు అనేకం.. చర్మం, జుట్టు సమస్యలు తొలగించడంలో సూపర్..!

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన చిరుత.. తన ఫ్రెండ్‌ జోలికొస్తే ఊరుకుంటుందా..!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?