AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock: రూ.లక్ష పెట్టుబడి.. 7 నెలల్లో రూ.94 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్..

గత కొన్ని సంవత్సరాలలో అనేక పెన్నీ స్టాక్‌లు మల్టీబ్యాగర్ స్టాక్‌లుగా ఉద్భవించాయి. ఈ స్టాక్స్ ఇన్వెస్టర్లకు చాలా మంచి రాబడిని అందించాయి.

Multibagger Stock: రూ.లక్ష పెట్టుబడి.. 7 నెలల్లో రూ.94 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్..
stock market
Venkata Chari
|

Updated on: Apr 03, 2022 | 7:43 PM

Share

Multibagger Stock: కరోనా కాలంలో ఈక్విటీలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో అనేక పెన్నీ స్టాక్‌లు మల్టీబ్యాగర్ స్టాక్‌లుగా ఉద్భవించాయి. పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందించాయి. వీటిలో చాలా బలమైన పెన్నీ స్టాక్‌లు ఉన్నాయి. గత ఐదు నెలల్లో ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడిని అందించిన ఓ స్టాక్ గురించి ఈ తెలుసుకుందాం. SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ స్టాక్ అక్టోబర్ 28, 2021న BSEలో రూ. 5.01 స్థాయి వద్ద ముగిసింది. అదే సమయంలో, ఏప్రిల్ 1న స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి, బీఎస్‌ఈలో ఈ స్టాక్ ధర పెరిగి రూ.470.55 వద్ద ముగిసింది. ఈ విధంగా, కేవలం ఐదు నెలల్లో, ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు 9,292.21 శాతం అద్భుతమైన రాబడిని ఇచ్చింది.

ఈ సంవత్సరం ఇప్పటివరకు 1,149% రాబడి..

డిసెంబర్ 31, 2021న కంపెనీ షేరు ధర రూ.37.65గా ఉంది. ఈ నెల మొదటి తేదీన షేరు ధర రూ.470.55 వద్ద ముగిసింది. ఈ విధంగా అంటే ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఈ కంపెనీ స్టాక్ దాని పెట్టుబడిదారులకు 1,149 శాతం రాబడిని అందించింది.

రూ. లక్ష నుంచి రూ. 94 లక్షలు..

ఒక ఇన్వెస్టర్ అక్టోబర్ 28, 2021న ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి, దానిని ఏప్రిల్ 1, 2022 వరకు ఉంచినట్లయితే, ఈ సమయంలో అతని పెట్టుబడి విలువ సుమారు రూ. 93.92 లక్షలు అవుతుంది. ఈ విధంగా, ఈ స్టాక్ పెట్టుబడిదారులు ఆరు నెలల లోపే ధనవంతులయ్యారు. ఈ విధంగా, ఒక వ్యక్తి డిసెంబర్ 31, 2021న ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ సమయంలో అతని పెట్టుబడి విలువ రూ.12.49 లక్షలకు చేరుకుంది.

ప్రాథమికంగా బలమైన షేర్లలో మాత్రమే పెట్టుబడి..

బలమైన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్‌లలో మాత్రమే పెట్టుబడి పెట్టాలని స్టాక్ మార్కెట్ నిపుణులు పెట్టుబడిదారులకు సలహా ఇస్తారు. దీని కోసం మీరు తక్కువ విలువ కలిగిన స్టాక్‌ల కోసం వెతకాలి. దీనితో పాటు, ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు, ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ప్లానర్ అభిప్రాయాన్ని తీసుకోండి.

Also Read: E Shram Card: విద్యార్థులు ఈ శ్రమ్‌ కార్డుని పొందగలరా.. కార్డుకి సంబంధించి ముఖ్య నియమాలు..!

Indian Economy: భారతీయ ఆర్థిక వ్యవస్థపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..!