Coffee: కాఫీతో ప్రయోజనాలు అనేకం.. చర్మం, జుట్టు సమస్యలు తొలగించడంలో సూపర్..!

uppula Raju

uppula Raju |

Updated on: Apr 03, 2022 | 5:55 PM

Coffee Benefits: మనం నిత్య జీవితంలో వాడే కాఫీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాఫీ చర్మానికే కాదు జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. మీరు మార్కెట్లో కాఫీతో తయారు చేసిన

Coffee: కాఫీతో ప్రయోజనాలు అనేకం.. చర్మం, జుట్టు సమస్యలు తొలగించడంలో సూపర్..!
Coffee Benefits

Coffee Benefits: మనం నిత్య జీవితంలో వాడే కాఫీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాఫీ చర్మానికే కాదు జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. మీరు మార్కెట్లో కాఫీతో తయారు చేసిన అనేక స్కిన్‌, హెయిర్‌ ప్రొడక్ట్స్‌ చూసినప్పటికీ అవి అంత సురక్షితం కావు. ఎందుకంటే అందులో రసాయనాలు కలిసి ఉంటాయి. వీటిని వాడటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అయితే కాఫీతో ఇంట్లోనే కొన్ని హోం రెమిడిస్ తయారుచేసుకోవచ్చు. వీటితో చర్మం, జుట్టుని ఆరోగ్యంగా చేసుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇందులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు చర్మం, జుట్టు సంరక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. చర్మానికి సంబంధించిన ప్రయోజనాల గురించి మాట్లాడితే.. మొటిమలను తొలగించడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో జుట్టును హెల్తీగా, షైనీగా మార్చే గుణాలు కూడా కాఫీలో ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది..

కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, కెఫిక్ యాసిడ్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కెఫిక్ యాసిడ్‌లో ఉండే గుణాలు చర్మాన్ని సూక్ష్మక్రిముల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఒక చెంచా కాఫీని ఒక పాత్రలో తీసుకుని, దానికి ఒక చెంచా తేనె కలిపి స్క్రబ్ చేయాలి. కావాలంటే మీరు తేనెకు బదులుగా బ్రౌన్ షుగర్ వాడవచ్చు. దీనికి నిమ్మరసం కలిపి స్క్రబ్ చేస్తే చర్మం క్లీన్ అవడమే కాకుండా లోపలి నుంచి హైడ్రేట్ అవుతుంది.

కళ్ళ వాపు నుంచి రక్షణ

చాలా సార్లు ప్రజలు బిజీగా ఉండటం, ఒత్తిడి కారణంగా కళ్ల చుట్టూ వాపు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మీరు కాఫీ సహాయం తీసుకోవచ్చు. కాఫీలో ఉండే కెఫిన్ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జరిగినప్పుడు చర్మం బిగుతుగా మారుతుంది. కాఫీని చర్మంపై అప్లై చేయడం ద్వారా కొంత సమయం తర్వాత కళ్లపై వాపు తగ్గడం ప్రారంభమవుతుంది.

జుట్టు కోసం

కాఫీలో యాసిడ్ ఉంటుంది ఈ కారణంగా ఇది జుట్టు సంరక్షణలో ఉత్తమమైనదని చెప్పవచ్చు. కాఫీని వెంట్రుకలకు, తలకు అప్లై చేయడం ద్వారా వాటి pH స్థాయి మెరుగుపడుతుంది. దీని కోసం మీరు కాఫీ హెయిర్ మాస్క్ తయారు చేయాలి. ఒక పాత్రలో రెండు మూడు చెంచాల కాఫీని తీసుకుని అందులో చల్లటి నీటిని కలపండి. కొద్దిసేపటి తర్వాత ఈ పేస్ట్‌ను తలకు, జుట్టుకు పట్టించాలి. ఈ మాస్క్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మృతకణాలు తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన చిరుత.. తన ఫ్రెండ్‌ జోలికొస్తే ఊరుకుంటుందా..!

TS TET 2022: టెట్‌ రాసే అభ్యర్థులకి గుడ్‌న్యూస్.. రేపటి నుంచి టీ-సాట్ స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు..!

Cricket Photos: తండ్రి, మేనమామ వారసత్వంగా క్రికెట్‌లోకి ఎంట్రీ.. ఇప్పుడు ప్రపంచంలోనే డేంజర్ బ్యాట్స్‌మెన్‌..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu