Tomato Ketchup: కమ్మగా ఉందని కెచప్‌ను తెగ తింటున్నారా.. అయితే, ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

టొమాటో కెచప్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్థూలకాయం సమస్య పెరుగుతుంది. ఇందులో పెద్ద మొత్తంలో చక్కెర, ఉప్పు, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపించే అవకాశం ఉంది.

Tomato Ketchup: కమ్మగా ఉందని కెచప్‌ను తెగ తింటున్నారా.. అయితే, ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
Nutrition Facts And Side Effects Of Tomato Ketchup
Follow us
Venkata Chari

|

Updated on: Apr 03, 2022 | 6:02 PM

టొమాటో కెచప్(Tomato Ketchup) అనేది నేడు ప్రతీ ఇంట్లో సర్వసాధారణ ఆహార పదార్థంగా మారిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తినడమే ఇందుకు కారణం. అలాగే పిల్లలతోపాటు పెద్దలు కూడా తినేందుకు ఇష్టపడుతున్నారు. కానీ, టొమాటో కెచప్ తినడం శరీరానికి చాలా హానికరం(Health) అని మీకు తెలుసా. దీన్ని ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం(Weight)తో పాటు అనేక ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్లో దొరికే కెచప్‌లో ప్రోటీన్ లేదా ఫైబర్స్ లేవు. ఇది రుచిని మెరుగుపరచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపించే అవకాశం ఉంది.

కెచప్ తీపి, పులుపు రుచిని కలిగి ఉంటుంది. దీనిలో టమోటా, వెల్లుల్లి, ఉల్లిపాయలతోపాటు మసాలాలు ఉంటాయి. చపాతీలు, సమోసాలు, దిల్ పసంద్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఎన్నో ఆహార పదార్థాలకు కెచప్ కీలకంగా మారింది. అలాగే ఎన్నో ఫాస్ట్ ఫుడ్‌లలోనూ దీనిని ఉపయోగిస్తారు. దీనిలో ప్రోటీన్ లేదా ఫైబర్స్ లాంటివి లేవు. దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు.

కెచప్‌లో కేలరీలు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇందులో చక్కెర, ఉప్పు మితమైన మొత్తంలో ఉంటాయి. కొందరు కెచప్‌ను “జీరో కేలరీలు”గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో ఉప్పు, పంచదార ఉంటుంది. అయితే ఇందులో విటమిన్లు లేదా ఖనిజాలు లేవు. అదే సమయంలో, కెచప్‌లోని ప్రధాన పదార్థాలు టమోటాలు అని మనకు తెలిసిందే.

టొమాటోలలోని కెరోటినాయిడ్ లైకోపీన్ క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు. అయితే కెచప్ తినడం కూడా అదే ప్రభావాలను చూపుతుందని సూచించడానికి ఎలాంటి పరిశోధనలు లేవు. అయితే, ఒక ఇటీవలి ఓ అధ్యయనంలో కెచప్‌తో సహా లైకోపీన్‌తో కూడిన వివిధ రకాల టొమాటో-ఆధారిత ఆహారాన్ని తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పేర్కొంది.

కానీ విచారకరమైన, ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, చాలా దుకాణాల్లో కొనుగోలు చేసిన టొమాటో కెచప్‌లో అధికంగా ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఇది అనారోగ్యకరమైనవి. మార్కెట్‌లో తయారు చేసే టొమాటో కెచప్‌లు కూడా కృత్రిమ రంగులు, అదనపు రుచులు, సంరక్షణకారులను కలిగి ఉంటాయి. ఇది పూర్తిగా పనికిరాని, అనారోగ్యకరమైన ఆహారంగా చేస్తుంది. ముఖ్యంగా పిల్లలపై ఇది చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

టొమాటో కెచప్ అధికంగా వాడడం వల్ల కలిగే అనార్థాలను ఇప్పుడు చూద్దాం.

స్థూలకాయం : టొమాటో కెచప్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్థూలకాయం సమస్య పెరుగుతుంది. ఇందులో పెద్ద మొత్తంలో చక్కెర, ఆహార సంరక్షణకారులను కనుగొనవచ్చు. దీని కారణంగా బరువు పెరిగే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. దీనితో పాటు, ఇది శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని తగ్గిస్తుంది.

ఎసిడిటీ: టొమాటో కెచప్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. దీన్ని చేయడానికి ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌ను ఉపయోగిస్తారు. ఇది కడుపు చికాకు, గ్యాస్ సమస్యను పెంచుతుంది.

అలర్జీ సమస్యలు: టొమాటో కెచప్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అలర్జీ సమస్యలు వస్తాయి. కెచప్‌లో హిస్టామిన్ రసాయనం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.

టొమాటో కెచప్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పేలవంగా మారుతుంది. మన రోజువారీ వంటకాలకు టొమాటో కెచప్‌ను జోడించడం మరిన్ని అనారోగ్యాలు కోరి తెచ్చుకున్న వాళ్లం అవుతాం. అయితే, మీరు మార్కెట్లో తయారు చేసిన టొమాటో కెచప్‌ను వదులుకునే ప్రక్రియలో రుచి విషయంలో రాజీ పడకూడదనుకుంటే, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. వాటిలో టొమాటో సల్సా, టొమాటో పచ్చడి, టొమాటో సాస్ లాంటివి ఉన్నాయి.

టొమాటో సల్సా..

టొమాటో సల్సా అనేది మెక్సికన్ డిప్. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడతారు. మీరు దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. సరళమైన, సులభంగా లభించే కూరగాయలను ఉపయోగించడం ద్వారా మీరు దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టొమాటోను రోస్ట్ చేసి బాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్, బెల్ పెప్పర్, మిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు, ఎండుమిర్చి జోడించండి. టొమాటో సల్సా సిద్ధమైంది.

టొమాటో సాస్

పండిన టమోటాలు, వెల్లుల్లి, ఉప్పు, చక్కెర, వెనిగర్ ఉపయోగించి దీన్ని సిద్ధం చేయవచ్చు. రుచిని పెంచడానికి మీరు దీనికి కొద్దిగా గరం మసాలాను జోడించవచ్చు. ఇది అనారోగ్యకరమైన టొమాటో కెచప్‌కి అత్యంత సన్నిహితమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

టొమాటో చట్నీ

ఇంట్లో టొమాటో చట్నీని త్వరగా, సులభంగా తయారుచేయవచ్చు. కరివేపాకు, ఆవాలు, మిరపకాయలు, అల్లం, వెల్లుల్లితో సహా అనేక మసాలా దినుసులతో టమోటాలు మగ్గించి, ఆ తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడం ద్వారా దీనిని తయారు చేస్తారు.

Also Read: Coffee: కాఫీతో ప్రయోజనాలు అనేకం.. చర్మం, జుట్టు సమస్యలు తొలగించడంలో సూపర్..!

Beauty Tips: ఈ 4 సహజపదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయి.. ఉపయోగించేటప్పుడు జాగ్రత్త..