Beauty Tips: ఈ 4 సహజపదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయి.. ఉపయోగించేటప్పుడు జాగ్రత్త..
Beauty Tips: చర్మ సంరక్షణ కోసం చాలా మంది మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడాక్ట్స్ వాడుతారు. కానీ చివరకు అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవని తెలుసుకుంటారు. అప్పటి
Beauty Tips: చర్మ సంరక్షణ కోసం చాలా మంది మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడాక్ట్స్ వాడుతారు. కానీ చివరకు అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవని తెలుసుకుంటారు. అప్పటి నుంచి ఇంట్లో సులభంగా ఉపయోగించే సహజసిద్దమైన పదార్థాలపై దృష్టి సారిస్తారు. వీటిని క్లెన్సర్‌లు, స్క్రబ్‌లు, టోనర్లు, ఫేస్ మాస్క్‌లుగా ఉపయోగిస్తారు. అయితే రసాయన పదార్థాల కంటే సహజసిద్దమైన పదార్థాలు మంచివే కానీ ఇవి కూడా చర్మానికి హాని చేసే గుణాలని కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. అయితే ఎలాంటి పదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయో తెలుసుకుందాం. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది నిమ్మకాయ గురించి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పిగ్మెంటేషన్ సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం మెరిసిపోవడానికి చాలా మంది దీని రసాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇది చాలా ఆమ్లంగా ఉంటుంది. నిమ్మకాయ చర్మం pH సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఈ కారణంగా చర్మంపై ఎలర్జీ మొదలవుతుంది.
తెల్ల చక్కెర
మీరు తెల్ల చక్కెరను ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగిస్తారు. అయితే దీన్ని రెగ్యులర్‌గా స్ర్కబ్ చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ఇది మంట, చికాకుని కలిగిస్తుంది. ఇతర చర్మ సమస్యలకి కారణమవుతుంది. మొటిమల సమస్య ఉన్నవారు తెల్ల ఉప్పు లేదా చక్కెరను ఎప్పుడూ ఉపయోగించకూడదు.
వంట సోడా
చాలా మంది బేకింగ్ సోడాని ఫేస్ ప్యాక్‌గా, స్క్రబ్‌గా ఉపయోగిస్తారు. బేకింగ్ సోడా వాడకం వల్ల హైపర్పిగ్మెంటేషన్ పెరుగుతుందని గుర్తుంచుకోండి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. దీనిని నేరుగా చర్మంపై ఉపయోగించకూడదు. ఇది చర్మానికి హాని కలిగిస్తుంది. ఇది దద్దుర్లు వంటి సమస్యలకు దారి తీస్తుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి