- Telugu News Photo Gallery Ramzan 2022 Fasting is also beneficial for health know the benefits in Telugu
Ramadan 2022 :రంజాన్ మాసంలో ఉపవాసం.. అధిక బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్..
Ramzan 2022 : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలు ఉపవాస దీక్షల్లో నిమగ్నమయ్యారు. ఈ ఉపవాస దీక్షలు అల్లాపై భక్తిభావానికి ప్రతీకగా భావిస్తారు. ఈ ఉపవాసం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
Updated on: Apr 03, 2022 | 4:48 PM

రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించడం వల్ల మనలో క్రమశిక్షణా భావన పెరుగుతుంది. దీంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మెరగవుతుంది.

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటివారు ఉపవాసం పాటించడం వల్ల అధిక బరువును కరిగించుకోవచ్చు. తక్కువ మోతాదులో తినడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

ఈ మాసంలో ముస్లింలందరూ ఉపవాసం విరమించడానికి ఖర్జూరాలు తీసుకుంటారు. దీనివల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంద. అదేవిధంగా ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి వంటి పలు పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తాయి.

ఉపవాస సమయంలో ధూమపానం, పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని ఇస్లాం సూచిస్తుంది. కాబట్టి చెడు అలవాట్లను వదిలించుకోవడానికి రంజాన్ దీక్షలు మంచి సమయం.

ఉపవాసం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండడం వల్ల సాయంత్రం పూట ఇఫ్తార్ తీసుకుంటే శరీరంలో అడిపోనెక్టిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలోని పోషకాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.





























