TS TET 2022: టెట్‌ రాసే అభ్యర్థులకి గుడ్‌న్యూస్.. రేపటి నుంచి టీ-సాట్ స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు..!

TS TET 2022: తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన

TS TET 2022: టెట్‌ రాసే అభ్యర్థులకి గుడ్‌న్యూస్.. రేపటి నుంచి టీ-సాట్ స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు..!
Ts Tet 2022
Follow us
uppula Raju

|

Updated on: Apr 03, 2022 | 4:43 PM

TS TET 2022: తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అధికారులు అన్ని శాఖలలో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ముందస్తుగా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022 నోటిఫికేషన్‌ (TET 2022 Notification) విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అయితే టెట్ రాసే అభ్యర్థులకు టీ-సాట్ నెట్ వర్క్ చానెళ్లు స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేశాయి. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి జూన్ ఐదో తేదీ వరకు రెండు నెలలు అంటే 60 రోజుల పాటు పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నాయి. ఈ మేరకు టి-సాట్ నెట్వర్క్ చానెళ్ల సీఈవో శైలేష్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అరగంట పాటు మొదటి పేపర్, ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు మరో అరగంట పాటు రెండో పేపర్ కు సంబంధించిన పాఠ్యాంశాలు ప్రసారమవుతాయని తెలిపారు.

సోమవారం నుంచి వారం రోజుల పాటు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం2 గంటల నుంచి నాలుగు గంటల వరకు టెట్ మొదటి, రెండో ప్రశ్న పత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలపై ప్రత్యక్ష ప్రసారాలుంటాయని శైలేష్ రెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 4 నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు 12 పేపర్లపై ప్రత్యేక అనుభవం కలిగిన వారితో అవగాహన పాఠ్యాంశ ప్రసారాలుంటాయని తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మెథడాలజీ, సోషల్ స్టడీస్ కంటెంట్, మ్యాథ్స్, సైన్స్, ఈవీఎస్, బయాలజీ, ఛైల్డ్ ఉడ్ డెవల్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టులపై పాఠ్యాంశాల గురించి క్లాసులు ఉంటాయన్నారు. ఆరు రోజుల స్పెషల్ లైవ్ తో పాటు (రెండు నెలలు) 60 రోజులు, 120 పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. మాక్ టెస్ట్, (క్విజ్) ఇంట్రెస్టింగ్ జనరల్ నాలెడ్జ్ పేరుతో ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసి టీ-సాట్ వెబ్ సైట్, ఛానళ్లు, యూట్యూబ్ ద్వారా అభ్యర్థులకు అందుబాటులోకి ఉంచినట్లు ఈ సందర్భంగా శైలేష్‌ రెడ్డి వివరించారు.

Cricket Photos: తండ్రి, మేనమామ వారసత్వంగా క్రికెట్‌లోకి ఎంట్రీ.. ఇప్పుడు ప్రపంచంలోనే డేంజర్ బ్యాట్స్‌మెన్‌..!

Beauty Tips: ఈ 4 సహజపదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయి.. ఉపయోగించేటప్పుడు జాగ్రత్త..

Post Office: దేశంలోని 96% పోస్టాఫీసులు CBSతో అనుసంధానం.. ఇక అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే..!