Viral Video: సింహానికి చుక్కలు చూపించిన చిరుత.. తన ఫ్రెండ్‌ జోలికొస్తే ఊరుకుంటుందా..!

Viral Video: అడవిలో అనేక రకాల జంతువులు నివసిస్తున్నప్పటికీ సింహం కంటే ప్రమాదకరమైన జీవి మరొకటి లేదు. అయితే పెద్ద పులులు, చిరుతపులులు కూడా చాలా

Viral Video: సింహానికి చుక్కలు చూపించిన చిరుత.. తన ఫ్రెండ్‌ జోలికొస్తే ఊరుకుంటుందా..!
Lion Attacks
Follow us
uppula Raju

|

Updated on: Apr 03, 2022 | 5:14 PM

Viral Video: అడవిలో అనేక రకాల జంతువులు నివసిస్తున్నప్పటికీ సింహం కంటే ప్రమాదకరమైన జీవి మరొకటి లేదు. అయితే పెద్ద పులులు, చిరుతపులులు కూడా చాలా ప్రమాదకరమైనవే కానీ సింహం శక్తి ముందు అవి నిలవలేవు. ఎందుకంటే అడవికి రాజు సింహం. ఎవ్వరైనా తల వంచాల్సిందే. జంతువులని వేటాడటంలో సింహానికి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. కానీ కొన్నిసార్లు సింహాలు, పులుల కలిసి కూడా జంతువులని వేటాడుతాయి. అంతేకాదు వేటాడిన జంతువుల కోసం పోట్లాటకి కూడా దిగుతాయి. ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఎప్పుడైనా సరే ఇంటర్‌ నెట్‌లో జంతువుల కంటెంట్‌కి ఆదరణ బాగా ఉంటుంది. తాజాగా చిరుత, సింహానికి సంబంధించిన ఒక ఫైట్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఆ వీడియో సంగతేంటో చూద్దాం.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో సింహాలన్ని కలిసి ఒక చిరుతని వేటాడాయి. కానీ అది ఇంకా బతికే ఉంటుంది. తన స్నేహితుడిపై జరుగుతున్న దాడిని గమనించిన చిరుతల గుంపు వెంటనే అక్కడికి చేరుకుంటాయి. సింహాన్ని దాడి చేయకుండా నిలువరిస్తాయి. అంతేకాదు గుంపు మొత్తం కలిసి సింహాన్ని బెదరగొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఓ చిరుత పులి ఏకంగా దానిపై దాడి చేస్తుంది. దీంతో సింహం వెనక్కి వెళ్లి పోవాల్సి వస్తుంది. ఇలా పులులన్ని కలిసి సింహం బారినుంచి గాయపడిని చిరుతని కాపాడుతాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ షాకింగ్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో వైల్డ్‌మాఫీషియల్ అనే ID పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోని ఇప్పటివరకు 1 లక్షా 15 వేల మంది వీక్షించారు. 2 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

View this post on Instagram

A post shared by WILDMA? (@wildmaofficial)

TS TET 2022: టెట్‌ రాసే అభ్యర్థులకి గుడ్‌న్యూస్.. రేపటి నుంచి టీ-సాట్ స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు..!

Cricket Photos: తండ్రి, మేనమామ వారసత్వంగా క్రికెట్‌లోకి ఎంట్రీ.. ఇప్పుడు ప్రపంచంలోనే డేంజర్ బ్యాట్స్‌మెన్‌..!

Beauty Tips: ఈ 4 సహజపదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయి.. ఉపయోగించేటప్పుడు జాగ్రత్త..