మనుషులకు మద్యం అలవాటు చేసింది ఆ జంతువులేనట.. కొత్త స్టడీలో షాకింగ్ నిజాలు..
కోతులు కేవలం ఆల్కహాల్ ఉన్న పండ్ల కోసం వెతుకుతూ ఉంటాయంట. అవి పండిన తర్వాత కొంచెం కుళ్ళిపోతాయి. కొత్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
మద్యపానం(alcohol) పట్ల మనిషికి ఉన్న ప్రేమకు కారణాన్ని తెలుసుకోవడానికి కోతులపై పరిశోధన(Study)లు జరిగాయి. ఇందుకోసం కోతులు తిన్న పండ్లు, వాటి మూత్ర నమూనాలను పరిశీలించారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాలను చూసి, శాస్త్రవేత్తలు షాక్ అయ్యారంట. కోతులు(Monkeys) కేవలం ఆల్కహాల్ ఉన్న పండ్ల కోసం వెతుకుతూ ఉంటాయంట. అవి పండిన తర్వాత కొంచెం కుళ్ళిపోతాయి. కొత్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వాస్తవానికి, కోతి తినే పండ్లలో దాదాపు 2 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. వాస్తవానికి, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన జీవశాస్త్రవేత్త రాబర్ట్ డడ్లీ 25 సంవత్సరాలుగా మానవులు మద్యపానానికి ఎందుకు బానిలవుతున్నారంటూ పరిశోధనలు చేస్తున్నారు. 2014లో, అతను దానిపై ఒక పుస్తకాన్ని (ది డ్రంకెన్ మంకీ: వై వి డ్రింక్ అండ్ అబ్యూజ్ ఆల్కహాల్) రాశాడు. ఇందులో మద్యం పట్ల మనుషులకు ఉన్న ప్రేమ కోతులు, లంగూర్ల ఫలితమేనని అతను సూచించాడు. కోతులు, లంగూర్లు వైన్ వాసన కారణంగా పండ్లు పండే వరకు వేచి ఉంటాయి. ఆ మేరకు పండ్లలో ఆల్కహాల్ జాడలు కనిపిస్తున్నాయంట. ఆ తర్వాత వాటిని తింటాయని తేల్చారు.
కోతులు తినే పండ్లు, మూత్ర నమూనాలపై అధ్యయనం..
ప్రస్తుతం మనుషుల్లో ఆల్కహాల్‌కు బానిస అవ్వడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఒక కొత్త అధ్యయనం జరిగింది. ఇది ‘డ్రంకెన్ మంకీ’ పరికల్పనకు మద్దతు ఇస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జీవశాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. పనామాలో దొరికిన బ్లాక్ హ్యాండ్ స్పైడర్ కోతులను, అవి తిన్న పండ్లు, మూత్రం నమూనాలను సేకరించారు.
కోతులు జాబోలోని కొన్ని కుళ్లిన పండ్లను తినడానికి ఇష్టపడతాయని అధ్యయనంలో తేలింది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ 1 నుంచి 2 శాతం మధ్య ఉంటుంది. ఇది సహజ కిణ్వ ప్రక్రియ నుంచి మాత్రమే వచ్చినట్లు కనుగొన్నారు. ఈ పరిమాణం తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండే బీర్‌తో సమానంగా ఉంటుంది. అంతే కాకుండా కోతుల మూత్రంలో కూడా మద్యం ఆనవాళ్లు కనిపించాయి. దీని నుంచి వారు శక్తి కోసం ఆల్కహాల్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించారు.
పరిశోధనలో పాల్గొన్న క్రిస్టినా క్యాంప్‌బెల్ మాట్లాడుతూ – మొదటిసారిగా మనిషిని పోలిన కోతులు ఆల్కహాలిక్ పండ్లను తింటాయని నిరూపించగలిగాం. ఇది మొదటి అధ్యయనం మాత్రమే. దీనిపై మరింత కృషి చేయాల్సి ఉంది. అయితే ఈ అధ్యయనం తర్వాత ‘డ్రంకెన్ మంకీ’ పరికల్పనలో ఖచ్చితంగా కొంత నిజం ఉందని తెలుస్తోంది.
ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, మానవులకు మద్యం తాగాలనే కోరిక కోతులు ఆల్కహాల్ ఆధారిత పండ్లను తినడం వల్ల వచ్చిందా లేదా అని తెలుసుకోవడమేనని ఆయన తెలిపారు. ఏదైమైనా.. కోతి నుంచే మానవుడు వచ్చాడని చదుకున్నాం. ఇప్పుడు మందు అలవాటు కూడా కోతి నుంచే వచ్చాయని శాస్త్రవేత్తలు తేల్చారన్నమాట.
Also Read: Multibagger Stock: రూ.లక్ష పెట్టుబడి.. 7 నెలల్లో రూ.94 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్..
ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్, పోస్టాఫీసు టైం డిపాజటిట్.. ఎక్కువ ఆదాయం దేని నుంచి లభిస్తుందంటే..?