Astro: శనిదోషాలతో ఇబ్బందిపడుతున్నారా.. ఇలా చేస్తే అంతా శుభమే..!

Astro: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే అతడిని దురదృష్టం వెంటాడుతుంది. శనిదేవుడి దయ లేకుంటే ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడు.

Astro: శనిదోషాలతో ఇబ్బందిపడుతున్నారా.. ఇలా చేస్తే అంతా శుభమే..!
Saturn
Follow us
uppula Raju

|

Updated on: Apr 03, 2022 | 8:58 PM

Astro: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే అతడిని దురదృష్టం వెంటాడుతుంది. శనిదేవుడి దయ లేకుంటే ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడు. అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. శని వక్ర దృష్టి కారణంగా అన్ని పనులు చెడిపోతాయి. శని ఎల్లప్పుడూ వారి కర్మ ప్రకారమే ఫలాలను ఇస్తాడు. మీ జాతకంలో శనికి సంబంధించిన దోషం ఉంటే అస్సలు భయపడకండి. శని దేవుడిని అనుగ్రహం పొందడానికి కింది జ్యోతిష్య పరిహారాలని చేస్తే సరిపోతుంది. కానీ చేసేటప్పుడు భక్తి శ్రద్దలతో చేయాలి. శనిదేవుడు తొమ్మిది గ్రహాలలో ఒకడు. సాధారణంగా శనిదేవుడిని కర్మను ఇచ్చేవాడు అంటారు. శని దేవుడి స్వభావం చాలా కోపంగా ఉంటుంది. అతడి రంగు నల్లగా ఉంటుంది. ఆలయాలలో కూడా శని దేవుడి విగ్రహం నలుపు రంగులోనే ఉంటుంది. శని దేవుడికి ఇష్టమైన రంగు కూడా నలుపే. నల్లటి నువ్వులు, నల్లటి దుస్తులు, నల్లటి వస్తువులు అతడికి సమర్పిస్తారు. దీంతో అతడు సంతోషించి తన భక్తులకు ఆశీర్వాదం అందజేస్తాడని నమ్మకం.

1. జాతకంలో శని సంబంధిత దోషాలను తొలగించడానికి మీ దగ్గర పనిచేసే సేవకులను వీలైనంత సంతోషంగా ఉంచాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎవరికీ బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు. అంతేకాదు ఎవరి నుంచి అలాంటి బహుమతి తీసుకోకూడదు. మరిచిపోయి కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు.

2. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మీరు శని దోషంతో బాధపడుతున్నట్లయితే శనివారం శని దేవాలయానికి వెళ్లి మీ బూట్లు లేదా చెప్పులు వదిలి ఇంటికి తిరిగి రావాలి. ఈ రెమెడీ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అలాగే దీని గురించి ఎక్కడా చర్చించకూడదు.

3. మీ జాతకంలో శని దోషం ఉంటే దానిని తొలగించడానికి రావిచెట్టుని ఆరాధించాలి. శనివారం రావిచెట్టుని పూజించడం ద్వారా శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. శనికి సంబంధించిన అన్ని కష్టాలు త్వరగా తొలగిపోతాయని నమ్ముతారు.

4. పూజలలో నలుపు రంగుకి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఈ కారణంగా శనిదేవుడు నలుపును తన ఇష్టమైన రంగుగా చేసుకున్నాడు. అప్పటి నుంచి శని దేవుడికి నలుపు రంగు వస్తువులను సమర్పించడం ప్రారంభమైంది. దీంతో శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇది కాకుండా మీరు ఎవరికైనా పేద, నిస్సహాయ లేదా ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే శనిదేవుడు ఆశీస్సులు లభిస్తాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

Dangerous Shark: ఆ నదిలో ప్రమాదకరమైన సొరచేప.. కొరికిందంటే క్షణాల్లో మరణం..!

ఎస్బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, పోస్టాఫీసు టైం డిపాజటిట్‌.. ఎక్కువ ఆదాయం దేని నుంచి లభిస్తుందంటే..?

E Shram Card: విద్యార్థులు ఈ శ్రమ్‌ కార్డుని పొందగలరా.. కార్డుకి సంబంధించి ముఖ్య నియమాలు..!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!