Ramzan 2022: ఉపవాస సమయంలో ఈ ఆరోగ్య చిట్కాలు పాటించండి.. ఫిట్‌గా ఉండండి..!

Ramzan 2022: ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం సంవత్సరంలో 9వ నెల రంజాన్ నెలగా పరిగణిస్తారు. ఈ మాసంలో

Ramzan 2022: ఉపవాస సమయంలో ఈ ఆరోగ్య చిట్కాలు పాటించండి.. ఫిట్‌గా ఉండండి..!
Ramzan 2022
Follow us
uppula Raju

|

Updated on: Apr 03, 2022 | 9:25 PM

Ramzan 2022: ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం సంవత్సరంలో 9వ నెల రంజాన్ నెలగా పరిగణిస్తారు. ఈ మాసంలో ప్రజలు రోజంతా ఆకలితో, దాహంతో అల్లాని ఆరాధిస్తారు. సుమారు 29 రోజుల నుంచి 30 రోజుల పాటు ఉపవాసం ఉన్న తర్వాత రంజాన్‌ పండుగతో ఈ తంతు ముగుస్తుంది. దీనినే ఈద్-ఉల్-ఫితర్ అంటారు. ఈ పండుగ సందర్భంగా సర్వ మతాల వారు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని విందును ఆరగిస్తారు. అయితే పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు సూర్యోదయానికి ముందే భోజనం చేస్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకుంటారు. దీనినే ఇఫ్తార్ అంటారు. ఉపవాస సమయంలో ముస్లిం మతస్థులు ఏమీ తినరు తాగరు. దీంతో ప్రారంభ రోజుల్లో చాలా సమస్యలని ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే కొన్ని పోషకాలు ఉన్న ఆహారాలని తీసుకోవడం వల్ల రోజంతా శక్తి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

మీరు ఉపవాసం చేయబోతున్నట్లయితే టీ లేదా కాఫీ తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. బదులుగా కొబ్బరి నీరు లేదా పుచ్చకాయ రసం వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి. ఉపవాస సమయంలో ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే మీ శరీరంలో రోజంతా శక్తి ఉంటుంది. కొంతమంది ఉపవాస సమయంలో పని నిమిత్తం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అధిక వేడి, ఆకలి కారణంగా, మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. వీలైతే ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి.

చల్లని ప్రదేశాలలో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వేడి, సూర్యకాంతి కారణంగా డీ హైడ్రేషన్‌ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోజంతా ఆకలి, దాహం వేసిన తర్వాత చాలా మంది ఇఫ్తార్ సమయంలో పరిమితికి మించి తింటారు. ఇది మంచిది కాదు. ఒక్కసారిగా ఆహారం తీసుకోవడం వల్ల ఉదర సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మీకు గ్యాస్, అజీర్ణం లేదా అసిడిటీ ఏర్పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమయంలో ఆహారాన్ని తేలికగా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు.

రంజాన్ డైట్‌లో పాలను కూడా చేర్చుకోవచ్చు. ఇది రీహైడ్రేటర్‌గా పనిచేస్తుంది. ఇది ఉపవాసం ఉన్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది. అదేవిధంగా శరీరానికి తగిన క్యాల్షియంను అందిస్తుంది. పెరుగులో కూడా దాదాపు 80 శాతం నీరు ఉంటుంది. పైగా ఇందులో తగినంత ప్రోటీన్, క్యాల్షియం కూడా ఉంటాయి. ఇవి బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహకరిస్తాయి. దోసకాయ దాదాపు 90 శాతం నీటితో నిండి ఉంటుంది. అంతేకాదు దీనిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఉపవాస సమయంలో దోసకాయను తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. అంతేకాదు ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

ఎస్బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, పోస్టాఫీసు టైం డిపాజటిట్‌.. ఎక్కువ ఆదాయం దేని నుంచి లభిస్తుందంటే..?

Dangerous Shark: ఆ నదిలో ప్రమాదకరమైన సొరచేప.. కొరికిందంటే క్షణాల్లో మరణం..!

Astro: శనిదోషాలతో ఇబ్బందిపడుతున్నారా.. ఇలా చేస్తే అంతా శుభమే..!