Anchor Anasuya: మరోసారి నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అనసూయ.. ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారంటూ..

యాంకర్ అనసూయకు (Anchor Anasuya) ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే.

Anchor Anasuya: మరోసారి నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అనసూయ.. ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారంటూ..
Ansuya
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 04, 2022 | 4:51 PM

యాంకర్ అనసూయకు (Anchor Anasuya) ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. బుల్లితెరపై.. వెండితెరపై తన వాక్చాతుర్యంతో.. నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్న అనసూయకు ట్రోలింగ్ కొత్తేమి కాదు. తాను షేర్ చేసే ప్రతి చిన్న ఫోటోపై.. పోస్ట్‏లపై ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్స్. ముఖ్యంగా అనసూయ డ్రెస్సింగ్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే తనను ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేసే వారికి తనదైన స్టైల్లో కౌంటరిస్తుంది అనసూయ. ఎప్పటికప్పుడు తన పోస్టులపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తుంది అనసూయ. తాజాగా మరోసారి తన డ్రెస్సింగ్ పై ట్రోల్ చేసిన ఓ నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చింది.

తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ” అనసూయ గారు.. మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు ” అంటూ కామెంట్ చేశాడు. అయితే ఇది చూసిన అనసూయ ఆ కామెంట్‏ను స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. తన ట్విట్టర్ ఖాతాలో ” దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు. ” అంటూ తన స్టైల్లో సమాధానమిచ్చింది. అనసూయ ట్వీట్‏కు నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు. పని పాట లేక కామెంట్స్ చేస్తారని.. అలాంటివేం పట్టించుకోకుండా మీ పని మీద ఫోకస్ చేయండి అంటూ అనసూయకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఆ కామెంట్స్ పై కూడా అనసూయ రియాక్ట్ అయ్యింది. ” ఇలాంటి కామెంట్లకు రియాక్షన్ అవసరం.. ఎందుకంటే కొద్దిమంది పురుషులు తమ కుటుంబాల్లో.. వారి పని ప్రదేశంలో.. సాధారణంగా స్త్రీలతో ఎలా ప్రవర్తించాలనే దానిపై అవగాహన కల్పించాలి. ఎలా గౌరవించాలనేది కూడా..” అంటూ రిప్లై ఇచ్చింది. ఇటీవల అల్లు అఱ్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి మెప్పించింది అనసూయ. అలాగే.. ఆచార్య, రంగమార్తాండ, దర్జా సినిమాల్లో కీలకపాత్రలలో నటిస్తోంది.

Also Read: Yami Gautam: హ్యాక్‌కు గురైన నటి యామీ గౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌.. అప్రమత్తంగా ఉండండి అంటూ..

Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్‌ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..

Piyush Goyal: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ధన్యవాదాలు తెలిపిన మూవీ యూనిట్‌..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!