AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‏తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ (Sonam Kapoor) తాను గర్భం దాల్చిన విషయాన్ని ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‏తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..
Sonam Kapoor
Rajitha Chanti
|

Updated on: Apr 04, 2022 | 3:43 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ (Sonam Kapoor) తాను గర్భం దాల్చిన విషయాన్ని ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాజాగా తన బేబి బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో సోనమ్ వైట్ అండ్ క్రీమ్ కలర్ వెరైటీ డిజైన్ చీరలో భారీ సంప్రదాయ ఆభరణాలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సోనమ్ తన ఇన్‏స్టా ఖాతాలో “గత రాత్రి @abujani1 పుట్టినరోజు. ఈ వేడుక కోసం నా బేబి బంప్ దుస్తులు @abujanisandeepkhosla, @kapoor.sunita, @rheakapoor @abhilashatd డిజైన్ చేశారు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సోనమ్ లేటేస్ట్ బేబి బంప్ ఫోటోషూట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలపై ఆమె సోదరి రియా కపూర్.. తండ్రి అనిల్ కపూర్, భర్త ఆనంద్ అహుజా స్పందిస్తూ రెడ్ హార్ట్ ఎమోజీస్ షేర్ చేశారు.

గత నెలలో సోనమ్ తన ప్రెగ్నేన్సి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. మిమ్మల్ని ఉత్తమంగా పెంచడానికి నాలుగు చేతులు, మీతో అడుగడుగునా ఏకధాటిగా కొట్టుకుంటున్నాయి రెండు హృదయాలు, మీకు ప్రేమను, మద్దతును అందించడానికి ఒక కుటుంబం ఎదురుచూస్తుంది. మీకు స్వాగతం పలకడానికి మేము వెయిట్ చేస్తున్నాం అంటూ రాసుకొచ్చింది సోనమ్. 2018లో ముంబైలో సంప్రదాయ వివాహ వేడుకలో సోనమ్, ఆనంద్ వివాహం చేసుకున్నారు.

Also Read: Yami Gautam: హ్యాక్‌కు గురైన నటి యామీ గౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌.. అప్రమత్తంగా ఉండండి అంటూ..

Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్‌ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..

Piyush Goyal: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ధన్యవాదాలు తెలిపిన మూవీ యూనిట్‌..