Hyderabad: ఫోన్ మాట్లాడుతుందని అనుమానం.. భార్యను చంపేందుకు సుపారీ.. చివరకు ఏమైందంటే?

Hyderabad Police: కట్టుకున్న భార్యను చంపాలని పలుమార్లు ప్లాన్ వేశాడు.. కానీ కుదరలేదు. చివరకు భార్యను చంపాలంటూ స్నేహితుడికి సుపారీ ఇచ్చాడు. చివరకు భార్యను చంపాలనుకున్నది భర్తేనని పోలీసులు తెల్చారు.

Hyderabad: ఫోన్ మాట్లాడుతుందని అనుమానం.. భార్యను చంపేందుకు సుపారీ.. చివరకు ఏమైందంటే?
crime news
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 05, 2022 | 7:13 AM

Hyderabad Police: కట్టుకున్న భార్యను చంపాలని పలుమార్లు ప్లాన్ వేశాడు.. కానీ కుదరలేదు. చివరకు భార్యను చంపాలంటూ స్నేహితుడికి సుపారీ ఇచ్చాడు. చివరకు భార్యను చంపాలనుకున్నది భర్తేనని పోలీసులు తెల్చారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించిన కేసును సనత్‌నగర్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితుడు తన మిత్రుడైన జూనియర్‌ ఆర్టిస్ట్‌కు రూ.7 లక్షల సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి ఒడినట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సనత్‌ నగర్‌ (Sanat Nagar) సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెల (మార్చి) 30న అర్ధరాత్రి 1.30 ప్రాంతంలో భరత్‌నగర్‌ కాలనీ మహేశ్వరినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్పందన (26) ను గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతుకోసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న భర్త వేణుగోపాల్‌ ఏడాదిన్నర వయసున్న కుమార్తెను తీసుకుని వరండాలోకి వెళ్లాడు. అప్పుడే ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించగా ఆమె కోలుకుంది. అయితే.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

స్పందన తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో.. వేణుగోపాల్‌ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ మేరకు యూసుఫ్‌గూడలో ఉండే మిత్రుడు, జూనియర్‌ ఆర్టిస్టు తిరుపతికి సుపారీ ఇచ్చాడు. అయితే.. గతేడాది డిసెంబరులో స్పందన మెదక్‌ జిల్లా చేగుంటలోని పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఉన్నప్పుడు తిరుపతి ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయినట్లు తిరుపతి తెలిపాడు. తిరుపతి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వేణుగోపాల్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

Guntur: చోరీ కోసం పక్కా ప్లాన్‌ వేశాడు.. కళ్లల్లో కారం కొట్టాడు.. చివరకు అలా దొరికిపోయాడు!

Rajasthan Police: శభాష్ పోలీస్.. ఆపద సమయంలో తెగువ.. మంటల్లో చిక్కుకుని చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్..