Rajasthan Police: శభాష్ పోలీస్.. ఆపద సమయంలో తెగువ.. మంటల్లో చిక్కుకుని చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్..
ఓ చిన్నారిని రక్షించేందుకు రాజస్థాన్(Rajasthan) కు చెందిన ఓ కానిస్టేబుల్ సాహసం చేశారు. చుట్టూ మంటలు చెలరేగుతున్నా ఏ మాత్రం అధైర్యపడకుండా మంటల్లో పరిగెత్తి చిన్నారిని కాపాడారు. ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారిని కాపాడడంపై పలువురు...
ఓ చిన్నారిని రక్షించేందుకు రాజస్థాన్(Rajasthan) కు చెందిన ఓ కానిస్టేబుల్ సాహసం చేశారు. చుట్టూ మంటలు చెలరేగుతున్నా ఏ మాత్రం అధైర్యపడకుండా మంటల్లో పరిగెత్తి చిన్నారిని కాపాడారు. ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారిని కాపాడడంపై పలువురు అభినందనలు చెబుతున్నారు. ఆ దృశ్యాలను షామిలికి చెందిన ఐపీఎస్ అధికారి సుకీర్తి మాధవ మిశ్రా ట్విట్టర్(Twitter) లో షేర్ చేశారు. ‘ఓ విలువైన ప్రాణాన్ని కాపాడిన రాజస్థాన్ పోలీస్ నేత్రేశ్ శర్మ పట్ల గర్వంగా ఉంది. మాటల్లో వర్ణించలేని విషయాన్ని ఈ ఒక్క చిత్రం ప్రతిబింబిస్తుంది’ అని ప్రశంసల వర్షం కురిపించారు. హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాజస్థాన్ కరౌలీలో ఏప్రిల్ రెండో తేదీన బైక్ ర్యాలీ(Bike Rally) నిర్వహించారు. వీరిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ గొడవల్లో కొందరు దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. అప్పుడు అక్కడ చిక్కుకుపోయిన చిన్నారిని రక్షించేందుకు ఓ కానిస్టేబుల్ పెద్ద సాహసం చేశారు. మంటలు చెలరేగుతున్న ఇంట్లోకి వెళ్లి చిన్నారిని కాపాడారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరోవైపు ఆందోళనలు అదుపు చేసేందుకు కరౌలీ ప్రాంతంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలకు పాక్షికంగా పరిమితులు పెట్టింది. 50 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
एक मां को साथ लिए, सीने से मासूम को चिपकाए दौड़ते खाकी के कदम।#RajasthanPolice के कांस्टेबल नेत्रेश शर्मा के जज्बे को सलाम।
करौली उपद्रव के बीच आमजन की सुरक्षा पुख्ता करने में जुटी पुलिस। @RajCMO @DIPRRajasthan @KarauliPolice pic.twitter.com/XtYcYWgZWs
— Rajasthan Police (@PoliceRajasthan) April 3, 2022
“ర్యాలీ సమయంలో ఒక్కసారిగా ఎవరో రాళ్లు విసిరారు. అప్పుడు రోడ్డుపై గాయపడిన ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు ఆసుపత్రికి తీసుకెళ్లమని అభ్యర్థించగా నేను వారికి సహకరించాను. అప్పుడే షాపులకు నిప్పు అంటుకున్నాయి. రెండు షాపుల మధ్య ఒక ఇల్లు ఉండటాన్ని నేను గ్రహించాను. ఆ ఇంట్లో చేతిలో పసిబిడ్డతో మహిళలు చిక్కుకుపోయి ఉన్నారు. వెంటనే వారి దగ్గరకు పరిగెత్తాను. నన్ను చూసిన వెంటనే వారు కాపాడమని అభ్యర్థించారు. నేను ఆ బిడ్డను తీసుకొని, నా వెనకాలే వారిని వచ్చేయమని చెప్పాను. అలా ఆ చిన్నారిని బయటకు తీసుకువచ్చి వారికి అప్పగించాను. ఇది కేవలం నా బాధ్యత”
– నేత్రేశ్, చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్
Also Read
TS Ed.CET: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..