Guntur: చోరీ కోసం పక్కా ప్లాన్‌ వేశాడు.. కళ్లల్లో కారం కొట్టాడు.. చివరకు అలా దొరికిపోయాడు!

AP Crime News: చోరీ కోసం పక్కా ప్లాన్‌ వేశాడు.. కళ్లల్లో కారం కొట్టి ఎస్కేప్ అవ్వాలని చూశాడు. కానీ ప్లాన్ కాస్తా రివర్స్ అయి.. ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ దారుణ ఘటన గుంటూరు నగరంలో పట్టపగలు జరిగింది.

Guntur: చోరీ కోసం పక్కా ప్లాన్‌ వేశాడు.. కళ్లల్లో కారం కొట్టాడు.. చివరకు అలా దొరికిపోయాడు!
Arrest
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 05, 2022 | 6:26 AM

AP Crime News: చోరీ కోసం పక్కా ప్లాన్‌ వేశాడు.. కళ్లల్లో కారం కొట్టి ఎస్కేప్ అవ్వాలని చూశాడు. కానీ ప్లాన్ కాస్తా రివర్స్ అయి.. ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ దారుణ ఘటన గుంటూరు నగరంలో పట్టపగలు జరిగింది. ఓ దొంగ చోరీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే స్థానికులు (guntur) పట్టుకోవడంతో చోరీ ప్లాన్‌ రివర్స్‌ అయింది. గుంటూరులోని నిత్యం రద్దీగా ఉండే శంకర్ విలాస్ సెంటర్ లో ఓ వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి డబ్బు దోచుకునే ప్రయత్నం చేశాడు ఓ దొంగ. ఇండియన్ బ్యాంకు నుంచి విజయ్ అనే వ్యక్తి నగదు డ్రా చేసుకుని వెళ్తుండగా అతనిపై అక్కడే వేచి ఉన్న దొంగ (thief) కళ్లల్లో కారం చల్లాడు. దాడి చేసి నగదు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు దొంగను పట్టుకున్నారు. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. కష్టపడి బ్యాంకులో దాచుకున్న డబ్బును డ్రా చేసుకుని తీసుకుని వెళ్తుండగా చోరీకి ప్రయత్నించాడని బాధితుడు చెబుతున్నాడు. బ్యాంక్‌ దగ్గర రెక్కీ నిర్వహించిన దొంగ, చోరీ కోసం బాగానే ప్లాన్‌ వేశాడు. అయితే స్థానికులు అలర్ట్‌ అయి బాధితుడి సొమ్ము దొంగ పాలుకాకుండా చూశారు.

కళ్లల్లో కారం కొట్టి డబ్బుతో ఉడాయించాలకున్న దొంగ ప్లాన్‌ రివర్స్‌ అయింది. దోచుకున్న డబ్బులు లెక్కపెట్టాలనుకున్న దొంగ ఇప్పుడు గుంటూరులోని అరండల్‌పేట పోలీస్టేషన్‌లో ఊచలు లెక్క పెడుతున్నాడు.

Also Read:

Rajasthan Police: శభాష్ పోలీస్.. ఆపద సమయంలో తెగువ.. మంటల్లో చిక్కుకుని చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్..

Dowry: అందంగా లేని అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాల్సిందే.. పాఠ్యపుస్తకంలో సంచలన అంశాలు