Graduate Engineer Trainee Jobs: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్! లక్షన్నర జీతంతో దామోదర్‌ వాలీ కార్పొరేషన్‌లో జాబ్స్‌..

భారత ప్రభుత్వానికి చెందిన కోల్‌కతాలోని దామోదర్‌ వాలీ కార్పొరేషన్‌ (DVC).. గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల (Graduate Engineer Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Graduate Engineer Trainee Jobs: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్! లక్షన్నర జీతంతో దామోదర్‌ వాలీ కార్పొరేషన్‌లో జాబ్స్‌..
Dvc
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 05, 2022 | 10:14 AM

DVC Graduate Engineer Trainee Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన కోల్‌కతాలోని దామోదర్‌ వాలీ కార్పొరేషన్‌ (DVC).. గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల (Graduate Engineer Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 56

మెకానికల్ పోస్టులు: 22 ఎలక్ట్రికల్‌ పోస్టులు: 22 సివిల్‌ పోస్టులు: 5 కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పోస్టులు: 5 ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ పోస్టులు: 2

పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో క‌నీసం 60 శాతం మార్కుల‌తో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌ 2022లో వ్యాలీడ్‌ స్కోర్ సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Indian Army NCC Recruitment 2022: ఎన్‌సీసీ మహిళ, పురుష అభ్యర్ధులకు ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..