చిన్న చర్చ్ vs పెద్ద చర్చ్ : అమెరికాలోనూ డిజిటల్ చర్చ్ వార్.. అసలు వివాదం ఏంటంటే..

Church vs Church: ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన డిజిటల్ చర్చ్ రచ్చ.. అమెరికాలో కూడా తప్పలేదు. కోవిడ్ ఎఫెక్టే ఈ రచ్చకు కారణమని ప్రధానంగా చెప్పుకోవాలి.

చిన్న చర్చ్ vs పెద్ద చర్చ్ : అమెరికాలోనూ డిజిటల్ చర్చ్ వార్.. అసలు వివాదం ఏంటంటే..
Church
Follow us

|

Updated on: Nov 05, 2021 | 12:34 PM

Church vs Church: ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన డిజిటల్ చర్చ్ రచ్చ.. అమెరికాలో కూడా తప్పలేదు. కోవిడ్ ఎఫెక్టే ఈ రచ్చకు కారణమని ప్రధానంగా చెప్పుకోవాలి. అమెరికాలో దాదాపు 45 శాతం మంది చర్చిలకు వెళ్తారు. అయితే, కోవిడ్ సమయంలో దాదాపు అందరూ చర్చిలకు వెళ్లడం మానేశారు. దాంతో ఎన్నో అమెరికన్ చర్చిలు మూత పడ్డాయి. అయితే, చర్చిలను నిర్వహించడానికి వాటి నిర్వాహకులు ఇంటర్నెట్ సేవల సహాయం తీసుకున్నారు. ఆన్‌లైన్ ప్రార్థనను స్టార్ట్ చేశారు. జూమ్ లో ప్రేయర్లు, ఆన్లైన్ డొనేషన్ సిస్టమ్స్, యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ లో ప్రేయర్ టెలికాస్టింగ్, యూట్యూబ్ చానెల్స్ లో వీడియోస్, ఆన్లైన్ బైబిల్ గ్రూప్స్, వంటి కొత్త ఐడియాలను తీసుకొచ్చారు కొందరు. దాదాపు మూడోవంతు చర్చిలు ఏదో ఒక విధంగా టెక్నాలజీ వాడుతున్నారు. ఇంకా ఆన్లైన్ సేవల వల్ల డొనేషన్లు కూడా పెరిగాయి.

అందరికి కుదరలేదు.. అయితే ఈ టెక్నాలజీ వాడకం కేవలం రిచ్, వైట్ చర్చిలు మాత్రమే చేయగలిగాయి. చాలా చర్చిలు బడ్జెట్ కోతలు, ఉద్యోగాలు పోయి దివాళా స్థితికి చేరాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత, నల్లజాతి వారి చర్చీల మీద భారీ ఎఫెక్ట్ పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని చర్చిలు డిజిటల్ మాధ్యమాన్ని తక్కువగా వాడుతున్నారని అన్నారు డ్యూక్ యూనివర్సిటీ నిపుణులు. ఎక్కువ మంది వృద్ధులు, తక్కువ జీతం ఉన్న ప్రాంతాల వారు, నల్లవారు ఉన్న ప్రాంతాల చర్చిలు దెబ్బతిన్నట్లు అధ్యయనంలో తేలింది. వీరికి అసలు ఇంటర్నెట్ కూడా పూర్తిగా అందుబాటులో ఉండదట. ఫలితంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. కొన్ని చర్చిలు సండే ప్రోగ్రామ్స్ మూసేసినట్లు, ఉద్యోగాలు తీసేసినట్లు సర్వే చెప్పింది. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా బ్లాక్ పాస్టర్లకు వచ్చిందని సర్వేలో పేర్కొన్నారు. ఇకపోతే.. కరోనా సంక్షోభ సమయంలో వైట్ పాస్టర్లు గతంలో కంటే ఎక్కువగా సంపాదించినట్లు లైఫ్ వే రీసెర్చ్ చెప్తోంది.

అందరికీ సదుపాయాలు కల్పించాలి.. టెక్నాలజీ అందుబాటులోకి లేక చిన్న చర్చిలు మూత పడుతున్న నేపథ్యంలో.. వీటిని ఆదుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. చర్చిల మనుగడ సాగించాలంటే.. చిన్న చర్చిలకు కూడా అవసరమైన సదుపాయాలు కల్పించాలంటున్నారు.

Also read:

Crime News: భర్తమీద కోపం బిడ్డలపై చూపించింది.. ఐదుగురి పిల్లల్ని కర్కశంగా హతమార్చిన తల్లికి జీవిత ఖైదు..

LPG Gas Cylinder: పెట్రో ధరలు తగ్గించినట్లే.. గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గిస్తేనే సామాన్యులకు ఊరట

Diwali Crackers: 400 ఏళ్ల క్రితం టపాకాయలు ఎలా పేల్చేవారో తెలుసా?.. తెలియకపోతే ఇప్పుడే చూసేయండి..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..