X gender Passport: తొలి  ‘X’ జెండర్‌ పాస్‌పోర్ట్‌ జారీ చేసిన అమెరికా.. ఎన్నో ఇష్యూస్ తరువాత ఈ నిర్ణయం.. (వీడియో)

X gender Passport: తొలి ‘X’ జెండర్‌ పాస్‌పోర్ట్‌ జారీ చేసిన అమెరికా.. ఎన్నో ఇష్యూస్ తరువాత ఈ నిర్ణయం.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 05, 2021 | 10:06 AM

లెస్బియన్‌, బై సెక్సువల్‌, గే, ట్రాన్స్‌జెండర్స్‌ LGBTQ వర్గం హక్కులను గుర్తించడంలో అగ్రరాజ్యం అమెరికా మరో ముందడుగేసింది. ఇందులో భాగంగా మహిళలు, పురుషులు కాని ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ‘X’ జెండర్‌ హోదా కలిగిన మొదటి పాస్‌ పోర్టును జారీచేసింది.


లెస్బియన్‌, బై సెక్సువల్‌, గే, ట్రాన్స్‌జెండర్స్‌ LGBTQ వర్గం హక్కులను గుర్తించడంలో అగ్రరాజ్యం అమెరికా మరో ముందడుగేసింది. ఇందులో భాగంగా మహిళలు, పురుషులు కాని ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ‘X’ జెండర్‌ హోదా కలిగిన మొదటి పాస్‌ పోర్టును జారీచేసింది. వచ్చే ఏడాది నుంచి ఇలాంటి పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని అమెరికా విదేశాంగ శాఖ ఈ సందర్భంగా తెలిపింది. అయితే ఈ పాస్‌పోర్ట్‌ను ఎవరికీ జారీ చేశారన్న వివరాలను మాత్రం బయటపెట్టలేదు. ప్రైవసీని కాపాడాలన్న సంకల్పంతోనే పాస్‌పోర్ట్‌ దారుల పూర్తి సమాచారం బహిరంగంగా చెప్పడం లేదని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ‘X’ జెండర్‌ హోదా పాస్‌పోర్ట్‌ జారీపై LGBTQ హక్కుల కార్యకర్త జెస్సికా స్టెర్స్‌ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో ఇదో చరిత్రాత్మక పరిణామమని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కొలరాడోకు చెందిన డానా జిమ్‌ పురుషుడిగానే జన్మించాడు. అయితే పెరిగే క్రమంలో ఆయనలో స్త్రీ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో నేవీలో పనిచేస్తున్నప్పుడు లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పూర్తి మహిళగా మారాడు. ఈ కారణంగా విదేశాలకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తనలాంటి వారికి ప్రత్యేక పాస్‌పోర్టులు జారీ చేయాలని 2015 నుంచి అమెరికా ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా జారీ చేసిన తొలి ‘X’ జెండర్‌ పాస్‌పోర్ట్‌ జిమ్‌కేనని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం పాకిస్తాన్ కూడా ఇలాంటి పాస్‌పోర్టులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)

Katrina Kaif Vicky Kaushal: ప్రియుడు విక్కీ కౌశల్‌తో త్వరలో కత్రినా పెళ్ళి.. రాజస్థాన్‌లో ఘనంగా ఏర్పాట్లు.. (వీడియో)