LPG Gas Cylinder: పెట్రో ధరలు తగ్గించినట్లే.. గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గిస్తేనే సామాన్యులకు ఊరట
LPG Cylinder: దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్ ధరలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ
LPG Cylinder: దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్ ధరలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా.. గురువారం నుంచి ధరలు అమల్లోకి వచ్చాయి. పెట్రోల్‌పై రూ.5 తగ్గించగా.. డీజిల్‌పై రూ.10 తగ్గిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిత్యం పెరుగుతున్న వాహనదారులకు కొంతమేర ఊరట లభించినట్లయింది. కేంద్ర ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్‌ను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. అరుణాచల్ ప్రదేశ్, బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే.. సామాన్యులను దోచుకున్నారని.. ఇంకా తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. యూపీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని.. మళ్లీ పెంచుతారంటూ పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారీగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా తగ్గించాలంటూ ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతుంది. పెట్రోల్ ధరలతోపాటు.. వంట గ్యాస్ ధర కూడా తగ్గిస్తే సాధారణ ప్రజలకు మేలవుతుందని పలు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.
దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఇంధన ధరలను మాత్రమే తగ్గిస్తే సరిపోదని.. వంటగ్యాస్ ధరలను కూడా తగ్గించాలని గోవా ప్రతిపక్ష నాయకుడు దిగంబర్ కామత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలను కూడా తగ్గించాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. ఇంధన ధరలను కొంత తగ్గించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ఎల్పీజీ సిలిండర్ ధరలను కూడా తగ్గించాలని.. కామత్ డిమాండ్ చేశారు. దీనిపై గోవా ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని కామత్ పేర్కొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనేకచోట్ల పరాజయం పాలైందని.. దీని కారణంగానే ప్రధాని మోదీ ఇంధన ధరలను తగ్గించాల్సి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
కాగా పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిన అనంతరం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పెట్రోల్ డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను తగ్గించారు. పెట్రోల్, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీంతో గోవాలో డీజిల్‌పై లీటరుకు రూ.17, పెట్రోల్‌పై రూ.12 మేర ధరలు తగ్గాయి.
Also Read: