Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: సీఐడీ సీరియల్ చూసి దారుణానికి పాల్పడిన మైనర్లు.. ఓ వృద్ధురాలిని అత్యంత పాశవికంగా..

Minor Boys Murder Elderly Woman: హిందీ భాషలో ప్రసారం అయ్యే సీఐడీ షోకు దేశవ్యాప్తంగా చాలామంది ప్రేక్షక అభిమానులున్నారు. తెలుగుతోపాటు.. పలు భాషల్లో ఈ టెలివిజన్ షో ప్రసారమవుతున్న

Crime News: సీఐడీ సీరియల్ చూసి దారుణానికి పాల్పడిన మైనర్లు.. ఓ వృద్ధురాలిని అత్యంత పాశవికంగా..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 05, 2021 | 11:42 AM

Minor Boys Murder Elderly Woman: హిందీ భాషలో ప్రసారం అయ్యే సీఐడీ షోకు దేశవ్యాప్తంగా చాలామంది ప్రేక్షక అభిమానులున్నారు. తెలుగుతోపాటు.. పలు భాషల్లో ఈ టెలివిజన్ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ టీవీ షోను చాలామంది క్రమం తప్పకుండా చూస్తుంటారు. అయితే.. ఈ టెలివిజన్ షో చూసి స్ఫూర్తి పొందిన ఇద్దరు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. 70 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత అటవికంగా హత్య చేశారు. ఈ షాకింగ్ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. సీఐడీ షో ద్వారా ప్రేరణ పొంది.. 16,14 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువకులు వృద్ధురాలిని చంపినట్లు పోలీసులు నిర్ధారించి.. నవంబర్ 2న అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాలిని బద్నారావు సోనావానే (70) అనే వృద్ధురాలు పూణెలోని సయాలి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. బాల నేరస్థులు కూడా షాలిని ఇంటికి సమీపంలోనే ఉండేవారు. అయితే.. అపార్ట్‌మెంట్‌లో వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుందని వారిద్దరూ కలిసి ప్లాన్ రచించారు. ఆమె ఇంటిలో దొంగతనం చేయాలని భావించారు.

ఈ క్రమంలో గత శనివారం (అక్టోబర్‌ 30) మధ్యాహ్నం 01:30 గంటల ప్రాంతంలో ఇద్దరు మైనర్లు కలిసి షాలిని ఇంట్లో ప్రవేశించారు. ఆ సమయంలో వృద్ధురాలు ఇంట్లో ఒక్కతే టీవీ చూస్తోంది. అనంతరం ఇద్దరూ కలిసి వృద్ధురాలిపై దాడి చేసి.. రూ.93 వేల నగదు, 68 వేలు విలువగల బంగారాన్ని దొంగతనం చేశారు. నిందితుల దాడిలో వృద్ధురాలు మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ వాఘ్‌మారే నేతృత్వంలోని బృందం చేపట్టిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు మైనర్లే ఆమెను హత్య చేసి దొంగతనం చేసినట్లు నిర్ధారించారు.

అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకోని విచారించగా.. నేరం తామే చేసినట్లు ఒప్పుకున్నారు. సీఐడీ షో ఎపిసోడ్‌ స్ఫుర్తితోనే తాము ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ ఘటన పూణేలో సంచలనంగా మారింది.

Also Read:

Hooch Tragedy: కాటేసిన కల్తీ మద్యం.. బీహార్‌లో 24 మంది మృత్యువాత.. మరికొంత మంది పరిస్థితి..

స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న.. 9వ తరగతి బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం