Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గబ్బిలం కాటుతో వ్యక్తి మృతి.. తరుముకొస్తున్న మరో ప్రాణాంతక వైరస్‌!

గబ్బిలం కాటుతో ఓ వ్యక్తి నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. గబ్బిలానికి అంత సీన్ ఉందా అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అవుననే చెప్పాలి. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటికే నలుగురు వ్యక్తులు గబ్బిలం కాటుతో మృతి చెందారు. వీరంతా అరుదైన ర్యాబీస్‌ వ్యాధితో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారుమరి..

గబ్బిలం కాటుతో వ్యక్తి మృతి.. తరుముకొస్తున్న మరో ప్రాణాంతక వైరస్‌!
Man Dies After Bat Bite In Australia
Srilakshmi C
|

Updated on: Jul 03, 2025 | 7:36 PM

Share

ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి అరుదైన ర్యాబీస్‌ వ్యాధితో మృతి చెందాడు. ప్రాణాంతకమైన ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసావైరస్ ( ABLV ) సోకడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. NSW హెల్త్ ప్రకారం.. న్యూ సౌత్ వేల్స్‌లో 50 ఏళ్ల వ్యక్తి ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసావైరస్ (ABLV) సోకడంతో జూలై 3 (గురువారం)న మృత్యువాత పడ్డాడు. మృతి చెందిన ఆ వ్యక్తి కొన్ని నెలల క్రితం గబ్బిలం కాటుకు గురి కావడంతో చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే కొన్ని వారాల తర్వాత అతడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాలో ABLV వైరస్‌తో ఇప్పటి వరకు నాలుగు మరణాలు సంభవించాయి. NSW హెల్త్‌లోని హెల్త్ ప్రొటెక్షన్ డైరెక్టర్ కైరా గ్లాస్గో మాట్లాడుతూ.. ఇది చాలా విషాదకరమైన పరిస్థితని అభివర్ణించారు. గబ్బిలం కాటు తర్వాత ఆ వ్యక్తి చికిత్స పొందాడు. అయినప్పటికీ అతని అనారోగ్యానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అన్నారు.

గబ్బిలాలను తాకొద్దని, ముఖ్యంగా సరైన టీకాలు తీసుకోకుండా వాటి వద్దకు వెళ్లవద్దని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆస్ట్రేలియాలోని ఏ గబ్బిలమైనా లైసా వైరస్‌కు కారకం కావచ్చు. అందువల్లనే గబ్బిలాలను దూరంగా ఉండాలని NSW హెల్త్ కమ్యూనిటీ తెలిపింది. శిక్షణ పొందిన, టీకాలు వేయించుకున్న వన్యప్రాణుల నిర్వాహకులు మాత్రమే గబ్బిలాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసావైరస్ రాబిస్‌తో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఈ వైరస్‌ సోకిన గబ్బిలం లాలాజలం ద్వారా వేగంగా మనుషులకు వ్యాపిస్తుంది. గబ్బిలం కాటు, స్క్రాచ్ ద్వారా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని NSW హెల్త్ కమ్యూనిటీ హెచ్చరించింది. ఈ వ్యాధికి చికిత్స లేదు. లక్షణాలు కనిపించకముందే ప్రారంభ చికిత్స తీసుకోవడం చాలా కీలకం. వైరస్‌కు గురైన రోగులకు వెనువెంటనే రాబిస్ ఇమ్యునోగ్లోబులిన్, రాబిస్ వ్యాక్సిన్ పూర్తి కోర్సు తప్పనిసరిగా తీసుకోవాలి.

ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసావైరస్ (ABLV) అంటే ఏమిటి?

ABLV అనేది ఆస్ట్రేలియన్ గబ్బిలాలలో కనిపించే అరుదైన ప్రాణాంతకమైన వైరస్. ఇది మనుషులలో రాబిస్ లాంటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. లక్షణాలు ప్రారంభమైన తర్వాత దీనికి చికిత్స ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు నాలుగు కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. అయితే దురదృష్టవశాత్తు వ్యాధి సోకిన నలుగురు మృత్యువాత పడ్డారు. గబ్బిలం కరిచిన, గీకిన వెంటనే అత్యవసరంగా వైద్య చికిత్స తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.