Bull Riding: దీనిపై కేవలం 8 సెకన్లు ఉంటే 25 కోట్ల రూపాయల బహుమతి!
Bull Riding: అత్యంత ప్రమాదకరమైన క్రీడలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది దాదాపు 1000 నుండి 1200 కిలోల బరువు ఉంటుంది. ప్రతి జంప్ లేదా కుదుపు వాహనం ఢీకొన్నప్పుడు ఉండే ప్రభావం ఉంటుంది. ఇందులో పాల్గొన్న రైడర్ తీవ్ర గాయాలకు గురవుతాడు. కొన్ని సందర్భాల్లో..

ప్రపంచంలో ధైర్యాన్ని పరీక్షించడమే కాకుండా, ఆటగాళ్లను జీవితం, మరణం మధ్య సాగే ఆటలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ప్రమాదకరమైన క్రీడల్లో ప్రాణాలు పోయే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి ఒక క్రీడ ఎద్దుల స్వారీ. ఇది అమెరికాలో చాలా ప్రజాదరణ పొందినది. ఈ క్రీడలో ఒక వ్యక్తి అదుపులేని, కోపంగా ఉన్న ఎద్దుపై కేవలం 8 సెకన్ల పాటు కూర్చుంటే అతను రూ. 25 కోట్ల బహుమతిని పొందవచ్చు అంటే దాదాపు 3 మిలియన్ డాలర్లు. 8 సెకన్లకంటే ఎక్కువ ఉన్న వ్యక్తికి ఈ కోట్లాది రూపాయల బహుమతి గెలుచుకుంటాడు. కానీ ప్రతిగా ఆటగాడు తన ప్రాణాలను కూడా పణంగా పెట్టాలి.
ఎద్దు స్వారీ అంటే ఏమిటి?
ఎద్దుల స్వారీ అనేది ఒక సాంప్రదాయ అమెరికన్ క్రీడ. దీనిలో పాల్గొనేవారు చాలా దూకుడుగా ఉండే ఎద్దు వీపుపై స్వారీ చేయాల్సి ఉంటుంది. గేటు తెరిచిన వెంటనే ఆ ఎద్దు తన బలంతో దూసుకుపోతుంది. ఆ ఎద్దు తన వీపుపై కూర్చున్న వ్యక్తిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ ఎద్దుపై కూర్చుని స్వారీ చేసినప్పుడు భారీ కుదుపులకు లోనవుతారు. అలాగే ఆ ఎద్దు దూకుడుతో ఆ వ్యక్తి కిందపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. చెప్పడానికి కేవలం 8 సెకన్లలు మాత్రమే కదా అని అనిపించవచ్చు. ఆ క్షణం ప్రాణాలతో సహవాసం చేయాల్సి ఉంటుంది. ఇందులో నియమ నిబంధనలు స్పష్టంగా ఉంటాయి. రైడర్ కనీసం 8 సెకన్ల పాటు పడిపోకుండా, ఎటువంటి మద్దతు లేకుండా ఎద్దు వీపుపై ఉండాలి. ఇది చాలా సులభం అనిపిస్తుంది. కానీ ఈ 8 సెకన్లు కొన్ని గంటలుగా అనిపిస్తాయి. అంతటి సాహాసం ఉంటుంది.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే..!
ఈ ఆట ఎంత ప్రమాదకరమైనది?
ఎద్దుల స్వారీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్రీడలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎద్దు దాదాపు 1000 నుండి 1200 కిలోల బరువు ఉంటుంది. ప్రతి జంప్ లేదా కుదుపు వాహనం ఢీకొన్నప్పుడు ఉండే ప్రభావం ఉంటుంది. ఇందులో పాల్గొన్న రైడర్ తీవ్ర గాయాలకు గురవుతాడు. కొన్ని సందర్భాల్లో తలకు తీవ్రమైన గాయాలు, వెన్నుముక విరిగిపోతుంది. కొన్నిసార్లు ఆటగాడు అక్కడికక్కడే మరణించే అవకాశాలు లేకపోలేదు.
ఇది కూడా చదవండి: Mobiles Block: సిమ్ కార్డులనే కాదు.. ఫోన్‌లను కూడా.. 27 లక్షల మొబైళ్లను బ్లాక్‌చేసిన కేంద్రం.. ఎందుకంటే..
అమెరికాలో ప్రతి సంవత్సరం వేలాది మంది పోటీదారులు ఈ క్రీడలో పాల్గొంటారు. కానీ కొంతమంది మాత్రమే దీనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దీని కోసం ఆటగాళ్ళు శారీరకంగా బలంగా ఉండటమే కాకుండా, మానసికంగా కూడా చాలా బలంగా ఉండాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా తట్టుకుని నిలబగలిగే వ్యక్తులు మాత్రమే ఇందులో పాల్గొనాలి.
ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే
ఈ ప్రాణాంతక సవాలును అధిగమించిన ఆటగాళ్ళు భారీ డబ్బు, కీర్తి రెండింటినీ పొందుతారు. ప్రతిష్టాత్మక పోటీలలో విజేతకు కోట్లాది రూపాయల బహుమతి లభిస్తుంది. దీనితో పాటు వారు స్పాన్సర్‌షిప్, ప్రకటనలు, మీడియా కవరేజ్ ద్వారా దీర్ఘకాలిక సంపాదన అవకాశాలను కూడా పొందుతారు. అయితే కీర్తితో పాటు ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే ఈ క్రీడలో పాల్గొంటారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎద్దుల స్వారీ లాంటి పోటీలు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి