Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobiles Block: సిమ్‌ కార్డులనే కాదు.. ఫోన్‌లను కూడా.. 27 లక్షల మొబైళ్లను బ్లాక్‌చేసిన కేంద్రం.. ఎందుకంటే..

Mobiles Block: దేశంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాలను అనుసరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి..

Mobiles Block: సిమ్‌ కార్డులనే కాదు.. ఫోన్‌లను కూడా.. 27 లక్షల మొబైళ్లను బ్లాక్‌చేసిన కేంద్రం.. ఎందుకంటే..
Subhash Goud
|

Updated on: Jul 03, 2025 | 4:48 PM

Share

దేశంలో మోసాలు పెరిగిపోతున్నాయి. సిమ్‌ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా ద్వారా రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న వారి 27 లక్షల మొబైల్‌లను బ్లాక్‌ చేసింది కేంద్ర ప్రభుత్వం. మోసాలకు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెడుతోంది. సైబర్ మోసం, బ్యాంకు మోసం, బ్లాక్‌మెయిలింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గత 15 నెలలుగా ఈ సిమ్‌కార్డుల బ్లాక్‌ ప్రక్రియను చేపట్టింది.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 20వ విడత వచ్చేది అప్పుడే..!

ఫోన్‌ల ద్వారా కొందరు SMS, WhatsApp, వాయిస్ కాల్‌ల ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. మార్చి 2024లో టెలికమ్యూనికేషన్స్ విభాగం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వేదిక అయిన చక్షు పోర్టల్‌లో దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టి DoT ఈ చర్యలు చేపట్టింది. పూర్తి దర్యాప్తు తర్వాత మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉన్న సిమ్ కార్డులను బ్లాక్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Vastu Tips: ఇంట్లో చీపురు ఈ దిక్కున పెడితే ఐశ్వర్యం.. ఇలా చేస్తే అరిష్టం!

మొబైల్ ఫోన్లు బ్లాక్:

అంతేకాదు.. కొత్త కొత్త సిమ్‌ కార్డులను ఉపయోగించి సైబర్‌ నేరాలకు పాలపడుతున్న వారి ఫోన్‌లను సైతం బ్లాక్‌ చేస్తోంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత ఏజెన్సీల సహకారంతో ఈ ఫోన్‌లను శాశ్వతంగా డీయాక్టివేట్ చేసింది. భవిష్యత్తులో వాటిని ఉపయోగించకుండా మొబైల్‌ IMEI (International Mobile Equipment Identity) నంబర్‌లను బ్లాక్ చేశారు.

డేటా విశ్లేషణ ప్రకారం.. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మొబైల్‌ల నుండి మోసపూరిత, బ్లాక్‌మెయిలింగ్ వంటివి గణనీయంగా పెరిగాయి. ఇక్కడ 2,00,000 కంటే ఎక్కువ మొబైల్‌లు డియాక్టివేట్ చేసింది ప్రభుత్వం. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో సుమారు 1,44,000 డీయాక్టివేషన్‌లు కాగా, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలలో సుమారు 1,22,000 డీయాక్టివేషన్‌లు జరిగాయి. ఢిల్లీలో సుమారు 1,15,000 మొబైల్‌లు బ్లాక్‌ అయ్యాయి. అలాగే ముంబైలో అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధం ఉన్న సుమారు 31,000 మొబైల్‌లు బ్లాక్‌ అయ్యాయి. మొత్తంమీద దేశవ్యాప్తంగా మొత్తం డీయాక్టివేట్ చేసిన మొబైల్ నంబర్‌లు సుమారు 26.95 లక్షలుగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో