AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holiday: జూలై 7న ప్రభుత్వ సెలవు ఉంటుందా..? విద్యార్థులకు రెండు రోజులు హాలిడే ఉంటుందా?

Holiday: మొహర్రం సందర్భంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, పోస్టాఫీసులు మూసివేయవచ్చు. ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో దీనిని రాష్ట్ర స్థాయి సెలవు దినంగా ప్రకటించారు. అలాగే..

Holiday: జూలై 7న ప్రభుత్వ సెలవు ఉంటుందా..? విద్యార్థులకు రెండు రోజులు హాలిడే ఉంటుందా?
Subhash Goud
|

Updated on: Jun 30, 2025 | 7:30 PM

Share

ఈసారి దేశవ్యాప్తంగా ముహర్రం ఎప్పుడు జరుపుకుంటారు? మొహర్రం 2025 జూలై 6 లేదా 7 తేదీలలో నిర్ణయించనున్నారు. మొహర్రం ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా ఒక పండుగ. అందుకే ఈ పండగ తేదీ చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. జూలై 5 రాత్రి చంద్రుడు కనిపిస్తే ముహర్రం జూలై 6 ఆదివారం జరుపుకుంటారు. లేకపోతే ముహర్రం జూలై 7 సోమవారం అవుతుంది. ముహర్రం రోజున ఎవరెవరికి సెలవు ఉంటుందో తెలుసుకుందాం.

సెలవు ఎక్కడ ఉంటుంది?

మొహర్రం సందర్భంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, పోస్టాఫీసులు మూసివేయవచ్చు. ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో దీనిని రాష్ట్ర స్థాయి సెలవు దినంగా ప్రకటించారు. మీరు ఏదైనా ముఖ్యమైన ప్రభుత్వ లేదా బ్యాంకు సంబంధిత పనిని ప్లాన్ చేస్తుంటే దానిని ముందుగానే పూర్తి చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి

బ్యాంకింగ్ సేవలు:

జూలై 6 ఆదివారం ముహర్రం వస్తే బ్యాంకు కస్టమర్లపై ఎటువంటి ప్రభావం ఉండదు. జూలై 7 సోమవారం ముహర్రం వస్తే అనేక రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి ఈ విధంగా చేస్తే పాఠశాలలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, బ్యాంకులకు ఆది, సోమ రెండు రోజులు సెలవులు రానున్నాయి. వినియోగదారులు తమ పనిని పూర్తి చేయడానికి ముందు లేదా తరువాత బ్యాంకు శాఖకు వెళ్లవలసి ఉంటుంది. కానీ కస్టమర్లు, కానీ ఉపశమనం ఏమిటంటే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI వంటి డిజిటల్ సేవలు మునుపటిలాగే కొనసాగుతాయి. సాధారణ వినియోగదారులు అవసరమైన లావాదేవీలను ఆన్‌లైన్‌లో చేయగలుగుతారు.

Auto News: ఫుల్ ట్యాంక్‌తో 780 కి.మీ మైలేజీ.. అపాచీ, పల్సర్‌లతో పోటీ పడే బైక్‌!

స్టాక్ మార్కెట్‌లో సెలవు:

ముహర్రం రోజున NSE, BSE వంటి ప్రధాన స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ఉండదు. ఇది ఈక్విటీ, డెరివేటివ్‌లు, కరెన్సీ, వడ్డీ రేటు డెరివేటివ్‌లు వంటి విభాగాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయితే, MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఉదయం ట్రేడింగ్ మూసి వేస్తారు. కానీ కమోడిటీ మార్కెట్లో ట్రేడింగ్ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు కొనసాగవచ్చు. కానీ జూలై 7న ముహర్రం వచ్చినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది.

ఇది కూడా చదవండి: Monthly Horoscope: ఈ రాశి వారికి జూలై నెల ఎలా ఉండబోతోందో తెలుసా? కుటుంబంలో విభేదాలు, అధిక ఖర్చులు