AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. వీరికి నోటీసులు పంపుతోంది.. ఎందుకో తెలుసా?

Income Tax Rules: ఈసారి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే ప్రక్రియలో కొత్త ఫారమ్‌లు, పన్ను పట్టికలో సవరణలు, నియమాలలో ముఖ్యమైన మార్పులు వంటి అనేక ప్రధాన మార్పులు జరిగాయి. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అనేక కేసులలో పూర్తి..

Income Tax: రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. వీరికి నోటీసులు పంపుతోంది.. ఎందుకో తెలుసా?
Subhash Goud
|

Updated on: Jun 29, 2025 | 9:11 PM

Share

2025-26 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఆదాయపు పన్ను శాఖ కఠినంగా దర్యాప్తు చేయబోతోంది. ఆదాయపు పన్ను శాఖ దీనికి సంబంధించి నోటీసు కూడా పంపుతుంది. ఇందులో ఐటీఆర్‌లో నమోదు చేయబడిన ఆదాయం, పన్ను, తగ్గింపు, పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిశీలిస్తారు.

ఈసారి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే ప్రక్రియలో కొత్త ఫారమ్‌లు, పన్ను పట్టికలో సవరణలు, నియమాలలో ముఖ్యమైన మార్పులు వంటి అనేక ప్రధాన మార్పులు జరిగాయి. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అనేక కేసులలో పూర్తి దర్యాప్తు నిర్వహించబోతోంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 14 జూన్ 2025న జారీ చేసిన కొత్త మార్గదర్శకాలలో దీనిని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: HDFC Credit Card: మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే.. కీలక మార్పులు!

ఆదాయపు పన్ను శాఖ మీ ఐటీఆర్‌ను నిశితంగా పరిశీలిస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం, తగ్గింపులు, పెట్టుబడులు, పన్ను మినహాయింపుల గురించిన ప్రతి సమాచారం సరిపోలి ఉండాల్సి ఉంటుంది. పేర్కొన్న షరతులు ఏవైనా వర్తిస్తే 30 జూన్ 2025 నాటికి దర్యాప్తు నోటీసు పంపిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. దర్యాప్తు నుండి కేసును మినహాయించడానికి ప్రిన్సిపల్ CIT ఆమోదం తప్పనిసరి. NACFACE ప్రక్రియ విదేశీ పన్ను కేసులు, కేంద్ర వర్గాలకు వర్తించదు.

ఆదాయపు పన్ను శాఖ క్రిప్టో లావాదేవీలపై సరైన పన్ను చెల్లించని లేదా ఐటీఆర్ షెడ్యూల్ వీడీఏలో క్రిప్టో ట్రాన్సాక్షన్లను నివేదించని పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఎత్తున నోటీసులు పంపిస్తోంది ఐటీ శాఖ. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్లను వెల్లడించాలని వివరాలను ఈ-మెయిల్‌ ద్వారా కోరుతోంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సరిదిద్దుకునేందుకు, తగిన పన్నులు చెల్లించేందుకు మరో అవకాశం ఇస్తోంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు క్రిప్టో ఆదాయాన్ని తక్కువగా చూపడం లేదా అసలు చూపకపోవడం వంటివి చేసినట్లు గుర్తించిన క్రమంలో ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ ఈ చర్యలు తీసుకుంటోంది. ఐటీఆర్‌లో వెల్లడించని విషయాలను గుర్తించి వారికి నోటీసులు పంపుతోంది. దీనికి సరైన సమాధానం లేకుంటే పెనాల్టీ, కేసులలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత అంబానీకి జీతం ఎంతో తెలుసా? వెలుగులోకి కీలక విషయాలు

ఇది కూడా చదవండి: ఈ విషయాలను ChatGPTని ఎప్పుడూ అడగకండి.. లేకుంటే ఇబ్బందుల్లో పడతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి