- Telugu News Photo Gallery Business photos From July 1: Aadhaar PAN Rule, New Bank Charges, And Tax Deadline Extension Take Effect
July New Rules: వినియోగదారులకు అలర్ట్.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. జూలై 1 నుంచి అమలు!
July New Rules: ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధర, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , క్రెడిట్ కార్డ్ మొదలైన వాటిలో వివిధ మార్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు జూన్ నెల ముగిసి జూలై నెల రాబోతోంది. మరి ఏయే మార్పులు చోటు చేసుకుంటున్నాయో తెలుసుకుందాం..
Updated on: Jun 30, 2025 | 2:40 PM

గ్యాస్ సిలిండర్ ధర: చమురు కంపెనీలు ధరలను సవరిస్తున్నందున ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. ఈ విషయంలో జూలై 2025 లో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతాయని చెబుతున్నారు.

పాన్ కార్డుకు ఆధార్ తప్పనిసరి: జూలై 1, 2025 నుండి పాన్ కార్డ్ (శాశ్వత ఖాతా సంఖ్య) పొందడానికి ఆధార్ తప్పనిసరి చేసింది. CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) కొత్త నిబంధనల ప్రకారం.. పాన్ కార్డ్ పొందాలనుకునే వ్యక్తులు ఆధార్ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి. దానితో పాటు, పాన్ కార్డ్ కోసం ఆధార్ ధృవీకరణ కూడా తప్పనిసరి చేసింది.

తత్కాల్ టికెట్ బుకింగ్: 2025 జూలై 1 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది భారతీయ రైల్వే. IRCTC మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. 2025 జూలై 15 నుండి ఆన్‌లైన్‌లో తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి ఉండాలని రైల్వే పేర్కొంది.

ఆదాయపు పన్ను దాఖలు: 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2025. ఈ పరిస్థితిలో CBDT దాని గడువును పొడిగించింది. దీని ప్రకారం, సెప్టెంబర్ 15, 2025ని చివరి తేదీగా ప్రకటించారు.

క్రెడిట్ కార్డుపై ఛార్జ్‌లు: HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం కొన్ని కొత్త ఛార్జీలను అమలు చేయనుంది. ఇప్పుడు మీరు Dream11, MPL లేదా Rummy Culture వంటి గేమింగ్ యాప్‌లపై నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, మీరు అదనంగా 1% రుసుము చెల్లించాలి. ఇది జూలై నెల నుంచి అమల్లోకి రానుంది. Paytm, Mobikwik, Freecharge వంటి వాలెట్లలో రూ. 10,000 కంటే ఎక్కువ లోడ్ చేయడంపై కూడా అదే ఛార్జీ విధించనున్నట్లు పేర్కొంది. దీనితో పాటు, యుటిలిటీ బిల్లు చెల్లింపు (విద్యుత్, నీరు, గ్యాస్ మొదలైనవి) రూ. 50,000 కంటే ఎక్కువగా ఉంటే అక్కడ కూడా ఈ అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంధనంపై నెలవారీ ఖర్చు రూ. 15,000 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కార్డ్ వినియోగదారులు 1% రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఏటీఎం ఛార్జీలు: ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం లావాదేవీలకు సంబంధించిన నియమాలను మార్చింది. ఇప్పుడు ఐసీఐసీఐ కస్టమర్లు ఏదైనా ఇతర బ్యాంకు ఏటీఎం నుండి నెలలో 3 సార్లు కంటే ఎక్కువ డబ్బును ఉపసంహరించుకుంటే, ప్రతి అదనపు ఆర్థిక లావాదేవీపై రూ. 23, ఆర్థికేతర లావాదేవీపై రూ. 8.50 ఛార్జీ విధించనుంది. ఇది ఏటీఎంను ఉపయోగించే ఖర్చును పెంచుతుంది.




