- Telugu News Photo Gallery Business photos Railways to revamp reservation system with early charting, more bookings
Indian Railways: తరచూ రైలులో ప్రయాణం చేస్తున్నారా.? ఇవి గమనించండి.. లేదంటే.!
తరచూ రైలు ప్రయాణం చేస్తున్నారా.? అయితే మీకోసం ఈ న్యూస్. జూలై 1 నుంచి కొత్తగా మార్పులు రానున్నాయి. ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.
Updated on: Jun 30, 2025 | 11:33 AM

ప్రయాణీకులకు సౌలభ్యమైన ప్రయాణాన్ని అందించేందుకు భారత రైల్వే.. తమ సర్వీసులను మరింత సులభతరం చేస్తోంది. ఇందులో భాగంగానే జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి చేయగా.. చార్ట్ ప్రిపరేషన్ కూడా నాలుగు గంటల నుంచి 8 గంటల ముందే సిద్దం చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

Train

ముందస్తు చార్టుల తయారీతో పాటు 2025 డిసెంబర్ నాటికి అధునాతన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్-PRS ను తీసుకొచ్చే దిశగా కూడా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అటు జూలై 1 నుంచి ట్రైన్ టికెట్ ధరలు కూడా స్వల్పంగా మారనున్నాయి.

ఫస్ట్ క్లాస్ ఏసీ రైలు ఛార్జీని కిలోమీటరుకు 0.5 పైసలు పెంచారు. సెకండ్ క్లాస్ ఛార్జీని కిలోమీటరుకు 1 పైసా పెంచారు. స్లీపర్ క్లాస్‌లో కిలోమీటరుకు 1 పైసా పెంచారు. అదేవిధంగా, ఫస్ట్ క్లాస్ ఛార్జీని కిలోమీటరుకు 1 పైసా పెంచారు. రైల్వే ఛార్జీలలో ఇటీవలి మార్పులలో రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్, ఇతర అదనపు ఫీజులలో ఎటువంటి మార్పు లేదు. ఈ ఛార్జీలన్నీ మునుపటిలాగే ఉంటాయి. ఇది కాకుండా ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనల ప్రకారం టికెట్ ధరపై GST విధింపు ఉంటుంది. ఛార్జీల రౌండింగ్ సూత్రాలు కూడా మునుపటిలాగే ఉంటాయి.

500 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు ఒక పైసా చొప్పున చెల్లించాల్సి ఉంది. అటు దళారులకు దక్కకుండా.. తత్కాల్ టికెట్ల మార్పులు కూడా ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉంటుందని రైల్వేశాఖ చెప్పింది.




