పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. కొన్ని రోజుల క్రితంతో పోలిస్తే బంగారం ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి.. ఇటీవల లక్ష మార్క్ దాటి పరుగులు పెట్టిన పసిడి ధర మారిన అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా నెమ్మదిగా దిగివస్తోంది. ముఖ్యంగా, ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం.. డిమాండ్ తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.
గత వారానికి ముందు లక్షా రెండు వేలకు చేరిన తులం బంగారం ధర.. రూ. 5 వేల మేర తగ్గి ఇప్పుడు 97 వేలకు తగ్గింది. కాగా, ఈ ధర మరింత తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ 30, 2025 సోమవారం ఉదయం దేశీయ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల తులం బంగారం ధర సగటున రూ. 97,260గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,150 గా ఉంది. శనివారంతో పోల్చితే.. సోమవారానికి 10 గ్రాముల బంగారం పై రూ.160 మేర ధర తగ్గింది. వెండి కేజీ ధర రూ. 100 తగ్గి.. రూ.1,07,700లుగా ఉంది. ఇక.. జూన్ 30,సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.97,260 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,150 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,17,700లుగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.97,410 పలుకుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.89,300 లుగా ఉంది.అక్కడ కేజీ వెండి ధర రూ.1,07,700 లుగా ఉంది. ఇక.. ముంబైలో 24 క్యారెట్ల తులం ధర రూ.97,260 గానూ, 22 క్యారెట్ల ధర రూ.89,150 ఉండగా, వెండి ధర కేజీ రూ.1,07,700 గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల తులం ధర రూ.97,260 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,150 గా ఉంది. వెండి ధర కేజీ రూ.1,17,700 లుగా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల తులం ధర రూ.97,260, 22 క్యారెట్ల ధర రూ.89,150 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,07,700 లుగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
