మరో అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు
నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు కమ్మేశాయి. దీంతోపాటు.. అరేబియా సముద్రంలో.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండడంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతం ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది..
దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. హెచ్చరించింది. మొత్తంగా ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
EPFO సభ్యులకు శుభవార్త..ఆటో సెటిల్మెంట్ విత్‌డ్రా రూ.5 లక్షలకు పెంపు
ప్రపంచంలోనే బుల్లి కారు.. దీని జోరే వేరు
తామరాకుని ఇలా కూడా వాడతారా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
52 ఏళ్లుగా దాన్ని కడుపులో దాచుకున్నావ్ మావా.. ఆశ్చర్య పోయిన వైద్యులు
కుమార్తెలపై కోపంతో రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఆలయం హుండీలో వేసిన తండ్రి

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
