52 ఏళ్లుగా దాన్ని కడుపులో దాచుకున్నావ్ మావా.. ఆశ్చర్య పోయిన వైద్యులు
చైనా కు చెందిన ఓ వ్యక్తి 12 ఏళ్ల వయసులో 17 సెంటీమీటర్ల పొడువున్న టూత్‌బ్రష్ ను మింగేశాడు. ఇప్పుడు అతడికి 64 సంవత్సరాలు. దాదాపు 52 సంవత్సరాల పాటు ఆ టూత్‌బ్రష్ అతడి కడుపులోనే ఉండిపోయింది. జీర్ణవ్యవస్థలో సమస్యతో టెస్ట్ చేయించుకుంటే ఆ విషయం బయటపడింది. యాంగ్ అనే వ్యక్తి 12 సంవత్సరాల వయసులో టూత్ బ్రష్‌ను మింగేశాడు.
దాని గురించి తన తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడ్డాడు. టూత్ బ్రష్ కడుపులోనే కరిగిపోతుందని యాంగ్ అనుకుని తన జీవితాన్ని కొనసాగించాడు. ఆ టూత్ బ్రష్ లోపలే ఉన్నప్పటికీ ఇప్పటివరకు, అతను ఎటువంటి ఆరోగ్య సమస్యనూ ఎదుర్కోలేదు. అయితే తాజాగా అతడు గ్యాస్ట్రిక్ సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. అతడికి స్కానింగ్ చేసిన డాక్టర్లు అతడి పేగుల్లో టూత్‌బ్రష్ ఉన్నట్టు గమనించారు. వెంటనే ఎండోస్కోపిక్ సర్జరీ చేసి ఆ బ్రష్‌ను తొలగించారు. నిజానికి పేగుల్లో టూత్‌బ్రష్ ఇరుక్కుపోతే పేగు కణజాలం మొత్తం దెబ్బ తిని ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది. అయితే యాంగ్ విషయంలో మాత్రం ఆ టూత్‌బ్రష్ పేగు మలుపులో ఇరుక్కుపోయి దశాబ్దాల పాటు కదలలేకపోయింది. అందువల్లే అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యా ఎదురుకాలేదు. అతడు నిజంగా చాలా అదృష్టవంతుడని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. ఐదు దశాబ్దాలుగా శరీరంలో టూత్ బ్రష్ ఉన్నా జీవించి ఉండటం నిజంగా ఆదృష్టం అని మరొకరు రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుమార్తెలపై కోపంతో రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఆలయం హుండీలో వేసిన తండ్రి
బామ్మా.. నువ్వు సూపర్ అంతే.. డ్రైవింగ్ స్టైల్‌కి నెటిజన్లు ఫిదా
మీరు భూతద్దం పెట్టి వెదికినా ఇక్కడ పాములు, దోమలు కనపడవు
Ram Charan: పెద్ది షూటింగ్‌లో ప్రమాదం.. చరణ్ చేతికి గాయం
ఈసారి చదరంగం కాదు రణరంగం.. అదిరిపోయిన బిగ్‌బాస్ సీజన్ 9 ప్రోమో..

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
