Ram Charan: పెద్ది షూటింగ్‌లో ప్రమాదం.. చరణ్ చేతికి గాయం
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 26న.. హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రౌడీ బాయ్ విజయ దేవర కొండ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
కార్యక్రమం చివరిలో భాగంగా అందరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అయితే ఈ సమయంలో రామ్ చరణ్ కొంచెం ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అతని చేతికి కట్టు కూడా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. ఇక రామ్ చరణ్ కట్టును చూసిన అభిమానులందరూ షాక్ అయ్యారు. అసలు రాంచరణ్ చేతికి ఏమైంది ఎందుకు అంత పెద్ద బ్యాండేజ్ వేశారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. పెద్ది సినిమా షూటింగులో గ్లోబల్ స్టార్ గాయపడ్డాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రామ్ చరణ్ గాయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పైగా ఈ గాయం పెద్దదేమీ కాదని స్పష్టమవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈసారి చదరంగం కాదు రణరంగం.. అదిరిపోయిన బిగ్‌బాస్ సీజన్ 9 ప్రోమో..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

