Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బామ్మా.. నువ్వు సూపర్ అంతే.. డ్రైవింగ్ స్టైల్‌కి నెటిజన్లు ఫిదా

బామ్మా.. నువ్వు సూపర్ అంతే.. డ్రైవింగ్ స్టైల్‌కి నెటిజన్లు ఫిదా

Phani CH
|

Updated on: Jun 28, 2025 | 9:56 AM

Share

80 ఏళ్ల వయసు వాళ్లు ఎలా ఉంటారో మనకు తెలుసు. సాధారణంగా ఆ వయసు వారు కంటి చూపు మందగించి, తమ రోజువారీ పనులు చేసుకోవటానికీ ఇంకొకరు మీద ఆధారపడే పరిస్థితిలో మనకు కనిపిస్తుంటారు. అయితే, ఈ 80 ఏళ్ బామ్మ మాత్రం.. ఏకంగా దుమ్మురేపే స్పీడులో ట్రాక్టర్ నడిపి.. వయసు నన్నేం చేస్తుంది? అంటోంది.

సినిమాల్లో స్టార్ హీరోలు సైతం చేయలేని విధంగా ఈమె ట్రాక్టర్ నడిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ‘బామ్మా.. నీకు నువ్వే సాటి’ అంటూ నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో, సదరు బామ్మ.. కూల్‌గా ట్రాక్టర్ స్టార్ట్ చేసి, ఎంతో అనుభవమున్న డ్రైవర్ మాదిరిగా నడుపుతూ కనిపిస్తుంది. వీడియో తీసే వారిని చూసిన చిరునవ్వుతో, చెప్పలేనంత కాన్ఫిడెన్స్‌తో ట్రాక్టర్ నడుపుతున్న బామ్మ బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్, యాటిట్యూడ్ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ముఖ్యంగా.. బామ్మగారు అలవోకగా స్టీరింగ్‌ను తిప్పే పద్ధతి, కూల్ ‌గా గేర్లు మార్చుతున్న తీరు చూస్తుంటే.. ఎంత పెద్ద డ్రైవరైనా ఈమె ముందు దిగదుడుపే అన్నట్లు అనిపిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్‌ తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. కొందరు ‘ అమ్మమ్మని కాదురా.. నిప్పుని’ అంటూ పుష్ప డైలాగ్‌ను అనుకరించే యత్నం చేయగా, ఇంకొందరు ఇప్పుడే ఇలా ఉంటే.. అప్పట్లో ఈ బామ్మ ఇంకా ఎలా ఉండేదో’ అనే అర్థం వచ్చే కామెంట్స్ చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీరు భూతద్దం పెట్టి వెదికినా ఇక్కడ పాములు, దోమలు కనపడవు

Ram Charan: పెద్ది షూటింగ్‌లో ప్రమాదం.. చరణ్‌ చేతికి గాయం

ఈసారి చదరంగం కాదు రణరంగం.. అదిరిపోయిన బిగ్‌బాస్ సీజన్ 9 ప్రోమో..