Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు భూతద్దం పెట్టి వెదికినా ఇక్కడ పాములు, దోమలు కనపడవు

మీరు భూతద్దం పెట్టి వెదికినా ఇక్కడ పాములు, దోమలు కనపడవు

Phani CH
|

Updated on: Jun 28, 2025 | 9:54 AM

Share

చిన్నప్పుడు కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అంటూ కథలు విన్నాం.. అలాంటి అడవులు ఉంటాయో లేదో కానీ పాములు, దోమలు మచ్చుకైనా కనిపించని దేశం మాత్రం ఉంది. కనీసం అక్కడ జూలో కూడా అవి కనిపించవంటే నమ్మశక్యం కాదు. కానీ అనేక సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, దాదాపు 1,300 జంతు జాతులు ఉన్నప్పటికీ, దోమలు, పాములు అక్కడ మనుగడ సాగించలేకపోయాయి.

ప్రపంచంలో దోమలు, పాములు కనిపించని ఏకైక దేశం ఐస్లాండ్. పాములు, ఇతర సరీసృపాలుకూడా లేని దేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి పాములు లేని దేశం అనే మరో పేరు కూడా వచ్చింది. ఐస్‌లాండ్‌లో వేగంగా మారుతున్న వాతావరణం, ఎక్కువ శీతల వాతావరణం దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వాతావరణం దోమల గుడ్ల అభివృద్ధికి ,పొదగడానికి ఆటంకం కలిగిస్తుందట. అందుకే దోమలు, పాములు లేని ప్రశాంతమైన, శుభ్రమైన, చల్లగా ఉండే దేశం ఐస్‌లాండ్‌. దోమలు సాధారణంగా మురుగు నీరు, నిల్వ ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. దోమల గుడ్లు దోమలుగా మారడానికి స్థిరమైన ఉష్ణోగ్రతలు కూడా అవసరం. అయితే, ఐస్లాండ్‌లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఐస్‌లాండ్‌ లో సహజ పారుదల , వేగంగా కదిలే నీటి వ్యవస్థల కారణంగా, దోమల పెంపకానికి అవసరమైన నిలిచిపోయిన నీరు, దోమల పునరుత్పత్తికి అనుమతించేంత కాలం ఉండదు. ఇక్కడ ఉండే ఉష్ణోగ్రతలు దోమల గుడ్లు లేదా లార్వాల కనుగుణంగా ఉండవు. దీని వలన దోమలు వృద్ధి చెందడం కష్టమవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఐస్‌లాండ్‌లోని భూమిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది, ఇది దోమల పెరుగుదలను నిరోధిస్తుంది. అలాగే, ఐస్‌లాండ్‌లో దోమల సహజ శత్రువులు కూడా ఉన్నాయి, ఇవి వాటి జనాభాను నియంత్రిస్తాయి ఇస్లాండ్‌లో దోమల్ని పోలిన కీటకాలుంటాయి. కానీ ఇవి కుట్టవు, వ్యాధులను వ్యాప్తి చేయవు. అలాగే పాములు నివసించలేని చల్లని దేశం ఐస్‌లాండ్‌. ఐస్ లాండ్ పేరుకు తగ్గట్టే.. మంచు ఉండే వాతావరణం.. పాముల మనుగడకు ఏమాత్రం అనువుగా ఉండదు. ఈ మంచు ప్రాంతంలో పాములు ఏమాత్రం జీవించలేవు. చుట్టూ నీటితో నిండి ఉండటం కూడా ఒక కారణం. పాములు మహా సముద్రాలను దాటవు. దోమలు అంత దూరం ఎగరవు. అందుకే ఐర్లాండ్‌లో దోమలు, పాములు కనిపించవని చెబుతారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: పెద్ది షూటింగ్‌లో ప్రమాదం.. చరణ్‌ చేతికి గాయం

ఈసారి చదరంగం కాదు రణరంగం.. అదిరిపోయిన బిగ్‌బాస్ సీజన్ 9 ప్రోమో..