కుమార్తెలపై కోపంతో రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఆలయం హుండీలో వేసిన తండ్రి
కుమార్తెలపై కోపంతో 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తిపత్రాలను.. ఆలయ హుండీలో వేసేశాడు ఓ తండ్రి. మరి ఇప్పుడు ఆ ఆస్తి.. ఆ అమ్మాయిలకు దక్కుతుందా..! లేక అమ్మవారికి చెందుతుందా..? దీనిపై న్యాయస్థానం ఏం తేల్చనుంది..? ప్రస్తుతం ఇదే తమిళనాడులో హాట్‌టాపిక్‌గా మారింది. తిరువణ్ణామలై జిల్లాలోని అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్..
తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన కస్తూరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మరో కుమార్తె సుబ్బులక్ష్మి వైద్యురాలిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్‌కి, కుమార్తెకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో అల్లుడి బంధువులు.. విజయన్‌ను బెదిరించడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల విషయంలో కుమార్తెలు తన మాట వినకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు విజయన్. దీంతో 4 కోట్ల రూపాయల విలువ చేసే తన రెండు ఇళ్లు, పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీరేణుకాంబాల్ ఆలయంలోని హుండీలో వేశాడు. తన ఆస్తి అంతా ఆలయ ఖజానాకు చెందుతుందని ప్రకటించాడు. తాను కష్టపడి ఆస్తులను సంపాదించానని, కానీ.. తన కుమార్తెలు ఆస్తి విషయంలో తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు విజయన్. అందుకే తన ఇష్టపూర్వకంగా ఆలయానికి తన ఆస్తులను ఇస్తున్నట్టు ప్రకటించాడు. మరోవైపు విషయం తెలుసుకున్న విజయన్ కుమార్తెలు.. తమ తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలను తమకు ఇవ్వాలంటూ ఆలయ అధికారులను సంప్రదించారు. తమ తండ్రితో పాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఆస్తులు సంపాదించిందని, వారిద్దరూ ఉమ్మడిగానే ఇళ్లు, పొలాలు కొనుగోలు చేశారని చెబుతున్నారు. తమ తండ్రి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఆలయ ఖజానాకు తమ ఆస్తులను ఇచ్చారని అన్నారు. తిరిగి వాటిని తమకు ఇవ్వాలంటూ తమ భర్తలతో కలిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ అధికారులు మాత్రం విరాళంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అప్పగిస్తామని ప్రకటించారు. మరోవైపు తమ కుటుంబ ఆస్తుల వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉందని, న్యాయస్థానం తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని చెబుతున్నారు విజయన్ కుమార్తెలు. మరి న్యాయస్థానం ఈ ఆస్తి వివాదానికి ఏ విధమైన ముగింపు పలుకుతుందో చూడాలి. ఏది ఏమైనా కుమార్తెలపై కోపంతో ఆలయానికి 4 కోట్ల రూపాయల ఆస్తుల రాసిచ్చిన వ్యవహారం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బామ్మా.. నువ్వు సూపర్ అంతే.. డ్రైవింగ్ స్టైల్‌కి నెటిజన్లు ఫిదా
మీరు భూతద్దం పెట్టి వెదికినా ఇక్కడ పాములు, దోమలు కనపడవు
Ram Charan: పెద్ది షూటింగ్‌లో ప్రమాదం.. చరణ్ చేతికి గాయం
ఈసారి చదరంగం కాదు రణరంగం.. అదిరిపోయిన బిగ్‌బాస్ సీజన్ 9 ప్రోమో..

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
