తామరాకుని ఇలా కూడా వాడతారా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
తామర పువ్వులను పూజలో ఉంచి దైవానికి సమర్పించడం హిందూ సాంప్రదాయంలో చూస్తాం. అయితే తామరాకులను చైనాలో ఏ విధంగా ఎందుకు వాడుతున్నారో చూపించే ఓ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా తామర పూలే కాదు ఆకుల్లో కూడా ఆరోగ్యానికి మేలు చేసే గుణాలున్నాయి. ఎండిన తామర ఆకుల పొడితో తయారు చేసిన టీని చైనాలో ఎక్కువగా తాగుతారు.
ఇది ఒక రకమైన హెర్బల్ టీ. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో పోటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తపోటు నియంత్రిస్తుంది. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఎండిన తామర ఆకుల పొడితో టీ చేసుకుని తాగే అలవాటు చైనాలో ఉంది. అయితే కొందరు మహిళలు పోస్ట్ చేసిన రీల్‌కి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ వారేం చేసారో తెలుసా. లోటస్ పూల ఆకుల్ని ముఖానికి పెట్టుకున్నారు. ఇది సన్‌స్క్రీన్ లాగా పనిచేస్తుందన్నది వారి అభిప్రాయం. కళ్లు కనిపించేలా ముక్కుకి గాలి అందేలా తామరాకుకు రంధ్రాలు చేసి మహిళలు దాన్ని ముఖానికి పెట్టుకున్నారు. సరికొత్త సన్‌స్క్రీన్ ఇదేనంటూ ఊదరగొట్టారు. తామరాకు సన్‌స్క్రీన్ తో బండి మీద వీరు రయ్‌మంటూ వెళ్లడం రీల్‌లో కనిపించింది. ఇంకేముంది దీన్ని ఓ క్రేజ్‌గా మార్చేసారు అక్కడి జనాలు. సన్‌స్క్రీన్ రాసుకునే అవసరం లేకుండా తామరాకునే ఇలా ముఖానికి పెట్టుకుంటే పోలా అంటూ ఫాలో అయిపోతున్నారట. ఈ రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ చిట్కా ఎంత వరకు పని చేస్తుంది? భానుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాల నుంచి ఇది చర్మాన్ని రక్షించగలదా అన్న అనుమానాలు కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం అందరికీ అలవాటు అయిందనీ అది రాసుకోకుండా అస్సలు బయటకు వెళ్లని వారు కూడా చాలా మందే ఉన్నారనీ ఒక యూజర్ కామెంట్ చేసాడు. సన్ స్క్రీన్ ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది నిగారింపును ఇస్తుంది కానీ తామరాకు ఆ పని చేయలేదు అని మరొకరు, సన్‌స్క్రీన్ వాడాల్సిందే అంటూ మరొకరు కామెంట్ పెడుతూ రీల్ ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
52 ఏళ్లుగా దాన్ని కడుపులో దాచుకున్నావ్ మావా.. ఆశ్చర్య పోయిన వైద్యులు
కుమార్తెలపై కోపంతో రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఆలయం హుండీలో వేసిన తండ్రి
బామ్మా.. నువ్వు సూపర్ అంతే.. డ్రైవింగ్ స్టైల్‌కి నెటిజన్లు ఫిదా

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
