Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO సభ్యులకు శుభవార్త..ఆటో సెటిల్మెంట్‌ విత్‌డ్రా రూ.5 లక్షలకు పెంపు

EPFO సభ్యులకు శుభవార్త..ఆటో సెటిల్మెంట్‌ విత్‌డ్రా రూ.5 లక్షలకు పెంపు

Phani CH
|

Updated on: Jun 28, 2025 | 11:38 AM

Share

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ EPFO సభ్యులకు శుభవార్త.. ముందస్తు PF ఫండ్‌కు సంబంధించి ఆటో సెటిల్‌మెంట్‌ పరిధిని సవరించింది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. ఇప్పుడు మీరు మీ PF ఫండ్ నుండి అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటే, మీరు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచింది.

ఈ సమాచారాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. అంటే ఇకపై రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు త్వరితగతిన సెటిల్‌ కానున్నాయి. అత్యవసర సమయాల్లో PF ఫండ్ క్లెయిమ్స్‌ చేసే ఈపీఎఫ్‌ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. కొవిడ్‌ సమయంలో ఆటోసెటిల్‌మెంట్‌ విధానాన్ని తొలిసారి ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చింది. తద్వారా ప్రజలు వీలైనంత త్వరగా తమ నిధులను పొందగలిగారు. గతంలో ఈ పరిమితి రూ. 1 లక్ష వరకు ఉండేది. కానీ ఇప్పుడు దానిని రూ. 5 లక్షలకు పెంచారు. అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైన వారికి ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. సాధారణ ఫీఎఫ్ సెటిల్‌మెంట్‌ను వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్‌ను ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చింది. మానవ ప్రమేయం లేకుండా క్లెయిమ్‌లను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్‌మెంట్‌ ముఖ్య ఉద్దేశం. వివాహం, ఉన్నత విద్య, ఇంటి కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్‌ ఆటో- సెటిల్‌మెంట్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని సాయంతో ఇకపై రూ.5 లక్షల వరకు మానవ ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌లో వేగంగా క్లెయిమ్‌ పొందొచ్చు. ఆటో సెటిల్‌మెంట్‌ అనేది ఐటీ వ్యవస్థతో పని చేస్తుంది. అర్హత ఉండి.. కేవైసీ, బ్యాంక్‌ వ్యాలిడేషన్‌ పూర్తయినట్లయితే ఐటీ టూల్స్‌ పేమెంట్‌ను ఆటోమేటిక్‌గా ప్రాసెస్‌ చేస్తాయి. దీనివల్ల క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ 3-4 రోజుల్లో పూర్తి అవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే బుల్లి కారు.. దీని జోరే వేరు

తామరాకుని ఇలా కూడా వాడతారా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

52 ఏళ్లుగా దాన్ని కడుపులో దాచుకున్నావ్ మావా.. ఆశ్చర్య పోయిన వైద్యులు

కుమార్తెలపై కోపంతో రూ.4 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఆలయం హుండీలో వేసిన తండ్రి

బామ్మా.. నువ్వు సూపర్ అంతే.. డ్రైవింగ్ స్టైల్‌కి నెటిజన్లు ఫిదా