రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బుక్ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోండి
తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకునే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ఇప్పటికే ఉన్న ట్రైన్‌లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది.
ఈ ప్రత్యేక రైళ్లు జులై 2 నుంచి 25వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వెళ్లే ట్రైన్ ప్రతి బుధవారం సాయంత్రం 5.20 గంటలకు నాంపల్లి స్టేషన్ నుంచి బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కన్యాకుమారి స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపింది. ఈ ట్రైన్ జులై రెండు నుంచి 25వ తేదీ మధ్యన నాలుగు ట్రిప్పులను పూర్తి చేస్తుందని రైల్వేశాఖ పేర్కొంది. ఇక కన్యాకుమారి నుంచి హైదరాబాద్ వచ్చే ట్రైన్ జులై 4 నుంచి 25 వరకు రాకపోకలు సాగిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ ట్రైన్ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు కన్యాకుమారి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి.. మరుసటిరోజు సాయంత్రం 2.30 గంటలకు నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొంది. నాంపల్లి-కన్యాకుమారి వెళ్లే ట్రైన్.. సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లె, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, చిదంబరం, మయిలదుతురై, కుంభకోణం, తంజావూర్, తిరుచిరాపల్లి, దిండిగుల్, కొడైకెనాల్, మధురై, విరుదునగర్, సాతూర్, కోవిల్‌పట్టి, తిరునల్వేలి, నాగర్ కోయిల్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్‌లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉన్నాయని రైల్వే శాఖ పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోగులను గాలికి వదిలేసి.. ఈ డాక్టర్ చేసిన పనికి.. అస్సలు..
‘ఇంకా మూడు రోజులే’.. వంగా వాణి నిజమైతే ?? బాబోయ్
వేసవిలో వెంకన్న హుండీకి రికార్డు ఆదాయం
పెళ్లైన పక్షం రోజులకే.. అత్తతో అల్లుడు జంప్.. అదే కదా మ్యాజిక్
టూ వీలర్ కొంటున్నారా.. ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

