23rd TANA Conference: కృష్ణా ఎల్లా దంపతులు, మురళీ మోహన్‌‌కు ప్రతిష్టాత్మక తానా అవార్డులు..

23rd TANA Conference: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో జరగనున్నాయి. TANA 2023 సభల కోసం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా భారీ ఏర్పాట్లు చేస్తోంది.

23rd TANA Conference: కృష్ణా ఎల్లా దంపతులు, మురళీ మోహన్‌‌కు ప్రతిష్టాత్మక తానా అవార్డులు..
Tana 2023
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 28, 2023 | 1:45 PM

23rd TANA Conference: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు జరగనున్నాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో ఈ మహాసభలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. TANA 2023 సభల కోసం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఇప్పటినుంచే భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహాసభల సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు తానా అవార్డులను అందించనుంది. ఈ మేరకు తానా.. అవార్డులు అందుకోబోయే ప్రముఖుల వివరాలను పంచుకుంది. తానా ఎన్టీఆర్‌ కల్చరల్‌ అవార్డును తెలుగు సినీనటుడు, మాజీ లోక్ సభ సభ్యుడు మాగంటి మురళీ మోహన్‌ కు అందించనున్నట్లు తానా ప్రకటించింది. మురళీమోహన్‌ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకుని కళారంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా.. ఆయనకు తానా అవార్డును బహుకరించనున్నట్లు తానా ప్రతినిధులు పేర్కొన్నారు.

Tana 2023

Tana 2023

తానా జీవిత సాఫల్య పురస్కారాన్ని కోవిడ్ మహమ్మారి నుంచి మానవాళిని కాపాడిన కోవాగ్జిన్ టీకా సృష్టికర్త, భారతదేశ మొట్టమొదటి తిమెరోసాల్ -ఫ్రీ హెపటైటిస్ బి వాక్సిన్ ఉత్పత్తిదారు అయినటువంటి భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డా.కృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల దంపతులకు ప్రదానం చేయనున్నట్లు తానా ప్రకటించింది.

Tana Awards

Tana Awards

తానా ఫౌండేషన్‌ అవార్డును అమెరికాలో స్థానిక తెలుగువారికి సహాయ సహకరాలు అందిస్తునందుకు గాను రంగనాథ బాబు గొర్రెపాటి కి  అందజేయనున్నట్లు తానా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ లోని ఘంటసాల కు చెందిన రంగనాథబాబు అమెరికాకు వెళ్లిన తొలి తరం ప్రవాస తెలుగువారిలో ఒకరని.. అయన తెలుగు వారికి అందించిన సేవలకు గాను దీనిని అందించినట్లు తానా ప్రతినిధులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

అలాగే, తెలుగు భాష కృషి కోసం విశేష సేవలందించిన వారికి ఇచ్చే గిడుగు రామమూర్తి అవార్డును  మనసు ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు‌ డా. మన్నం వెంకట రాయుడు కి బహుకరించనున్నట్లు తానా ప్రతినిధులు వివరించారు.

కాగా.. ఈ పురస్కార గ్రహీతలను తానా నాయకత్వం ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని.. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి పేర్కొన్నారు. ఎంపికైన ప్రముఖులకు ఈ సందర్భంగా అభినందించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి