Boat Capsize: వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా.. 37 మంది గల్లంతు..!
ట్యూనీషియా దేశం పోర్ట్ ఆఫ్ స్పాక్స్ నుంచి 46 మంది వలసదారులతో పడవ ఇటలీ బయలు దేరింది. బలమైన గాలుల కారణంగా వీరు ప్రయాణిస్తున్న బోటు ఇటాలియన్ ద్వీపం లాంపెడుసా వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం 37 మంది గల్లంతయ్యారు.
ట్యూనీషియా దేశం పోర్ట్ ఆఫ్ స్పాక్స్ నుంచి 46 మంది వలసదారులతో పడవ ఇటలీ బయలు దేరింది. బలమైన గాలుల కారణంగా వీరు ప్రయాణిస్తున్న బోటు ఇటాలియన్ ద్వీపం లాంపెడుసా వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం 37 మంది గల్లంతయ్యారు. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. బయటపడిన వారు ఉప-సహారా ఆఫ్రికాకు చెందిన వారు. వీరు మరో నౌక ద్వారా ప్రాణాలతో బయటపడినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.
ఉప –సహారా ప్రాంతం నుంచి వచ్చి ట్యూనీషియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆఫ్రికాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఆర్థికమాంద్యం కారణంగా అక్కడ జాత్యహంకార దాడులు పెరిగిపోయాయి. దీంతో ప్రజలు యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ట్యూనీషియా నుంచి మధ్యధరా సముద్రం అంతటా వలసలు పెరిగిపోయాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

