Railway Platform: ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం ఎక్కడుందో తెలుసా?
మీరందరూ ఎప్పుడో ఒకప్పుడూ రైల్వే స్టేషన్‌కు వెల్లే ఉంటారు. అక్కడ ప్లాట్‌ఫామ్‌లను కూడా చూసే ఉంటారు. సాధారణంగా ప్లాట్‌ఫామ్స్ 1 కిలో మీటర్ల పొడవు ఉంటాయి. కానీ మన దేశంలోని ఓ రాష్ట్రంలో ఉన్న రైల్వే ఫ్లాట్‌ఫామ్ మాత్రం మనం నడుస్తున్న కొద్ది ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇదే ప్రపంచలోని అత్యంత పొడవైన రైల్వే ఫ్లాట్‌ఫామ్ ఇంతకూ ఇది ఎక్కడుందనేగా మీ డౌట్ అయితే తెలుసుకుందాం పదండి.

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారత్ కూడా ఒకటి. అలాంటి భారతీయ రైల్వే శాఖ ఇప్పుడు మరో అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా రైల్వే స్టేషన్‌కు వెళ్తే ప్లాట్‌ఫారమ్‌లు కొంత దూరమే ఉంటాయి, కానీ కర్ణాటకలోని ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్‌లో మాత్రం నడుస్తూ పోతుంటే ప్లాట్‌ఫారమ్ కొనే కనిపించదు. ఎందుకంటే ఇదే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్. ఇది కర్ణాటకలోని శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్ళి జంక్షన్ లో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఏకంగా 1,507 మీటర్ల పొడవును ఉంటుంది.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
దీని అసాధారణ పొడవును అధికారికంగా గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ దీనిని ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫారమ్‌గా ప్రకటించింది. అయితే నార్మల్‌గా ఈ ప్లాట్‌ఫారమ్ పొడవును అంచనా వేయాలంటే.. దాదాపు 15 ఫుట్‌బాల్ మైదానాలను ఒకదాని వెనుక ఒకటి ఉంచితే ఎంత పొడవు ఉంటుందో, అంత పొడవున ఈ ప్లాట్‌ఫారమ్ ఉంటుందట. అయితే దీని కన్నా ముందు ఈ ప్రపంచ రికార్డు యూపీలోని గోరఖ్‌పూర్ జంక్షన్ రైల్వే ఫ్లాట్‌ఫారమ్‌పై ఉండే ఆ ప్లాట్‌ఫారమ్ 1,366 మీటర్లు పొడవు ఉండేది. అయితే, మార్చి 2023లో ఆధునీకరణ పనుల్లో భాగంగా హుబ్బళ్ళి ప్లాట్‌ఫారమ్‌ను 1500 మీటర్ల మేర రైల్వేశాఖ విస్తరించింది. దీంతో గోరఖ్‌పూర్ పేరున ఉన్న రికార్డును హుబ్బళ్ళి జంక్షన్ బద్దల కొట్టింది.
సౌత్‌లో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్
అంతేకాదు దక్షిణ భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో హుబ్బళ్ళి జంక్షన్ ఒకటి. ఇక్కడ రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, అలాగే భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి రైల్వే శాఖ ఈ ప్లాట్‌ఫారమ్‌ను విస్తరించింది. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఒకే సమయంలో రెండు రైళ్లను నిలిపి, కార్యకలాపాలు సాగించేలా ప్రత్యేకంగా కాన్ఫిగర్ చేశారు. దీనివల్ల రైల్వే సమయం ఆదా అవ్వడమే కాకుండా, స్టేషన్ నిర్వహణ సామర్థ్యం కూడా పెరిగింది.
కర్ణాటక ప్రధాన రవాణా కేంద్రం
ఈ హుబ్బళ్ళి జంక్షన్ కర్ణాటకలోనే అత్యంత కీలకమైన రవాణా కేంద్రం. ఈ స్టేషన్ గుండా నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు బెంగళూరు, ముంబై, గోవా, హైదరాబాద్ వంటి దేశంలోని ప్రధాన నగరాలకు ప్రయాణిస్తుంటారు. సరికొత్త హంగులతో, ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ రైల్వే స్టేషన్ ప్రస్తుతం భారతీయ రైల్వే రంగానికే ఒక గర్వకారణంగా నిలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
