AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం.. రైల్వే సిబ్బంది చేసిన పని తెలిస్తే..

భారతీయ రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తి, నిజాయితీని చాటే ఒక అద్భుతమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళా ప్రయాణికురాలు రైలు టాయిలెట్ వాడుతుండగా ఆమె విలువైన బంగారు ఉంగరం ప్రమాదవశాత్తు బేసిన్ గుండా కింద ఉన్న డ్రైనేజీ పైపులోకి పడిపోయింది. ఆందోళన చెందిన ఆమె వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న రైల్వే మెయింటెనెన్స్ సిబ్బంది, తదుపరి స్టేషన్‌లో రైలు ఆగగానే ఏమాత్రం

రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం.. రైల్వే సిబ్బంది చేసిన పని తెలిస్తే..
Gold Ring Reocvery
Jyothi Gadda
|

Updated on: May 16, 2026 | 12:26 PM

Share

భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత కోసమే కాకుండా, వారి సమస్యలను పరిష్కరించడంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని మరోసారి నిరూపించింది. రైలు ప్రయాణంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం చాలా కష్టమని అందరూ భావిస్తుంటారు. కానీ, ఇక్కడ జరిగిన ఒక అరుదైన ఘటనలో రైల్వే సిబ్బంది చూపిన నిజాయితీ, కార్తవ్య దీక్ష ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. రైలు టాయిలెట్‌లోని మురికి పైపులోకి జారిపోయిన ఒక మహిళ బంగారు ఉంగరాన్ని సిబ్బంది ఎంతో శ్రమించి వెలికితీసి వారికి తిరిగి అప్పగించారు. అసలేం జరిగిందంటే..

ఒక మహిళా ప్రయాణికురాలు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో టాయిలెట్‌కు వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఆమె చేతికున్న విలువైన బంగారు ఉంగరం ఊడి, నేరుగా టాయిలెట్ డ్రైనేజీ హోల్ గుండా కింద ఉన్న మురుగు పైపుల్లోకి వెళ్ళిపోయింది. ఎంతో సెంటిమెంట్, విలువైన ఆ ఉంగరం చేజారిపోవడంతో ఆమె ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అధైర్యపడకుండా, ఆమె వెంటనే రైల్వే అధికారులకు తెలియజేసింది. హెల్ప్‌లైన్ నంబర్ 139 ద్వారా ఈ విషయంపై రైల్వేకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

కంట్రోల్ రూమ్ నుండి సమాచారం అందుకున్న మెకానికల్, క్లీనింగ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. రైలు తదుపరి స్టేషన్‌లో ఆగడమే ఆలస్యం.. వారు వెంటనే రంగంలోకి దిగారు. టాయిలెట్ కింద ఉండే మురు, వ్యర్థాల పైపులను విప్పడం సాధారణంగా ఎంతో అసహ్యకరమైన, కష్టతరమైన పని. అయినప్పటికీ, రైల్వే సిబ్బంది ఏమాత్రం వెనుకాడకుండా టాయిలెట్ కింద ఉండే కెమికల్ ట్యాంక్, డ్రైనేజీ అవుట్‌లెట్ పైపులను విప్పి, ఆ మురికిలోనే ఉంగరం కోసం వెతకడం ప్రారంభించారు.

చివరకు వారి శ్రమ ఫలించింది. ఎంతో శ్రమించి ఆ మురుగు వ్యర్థాల నుండి బంగారు ఉంగరాన్ని సురక్షితంగా బయటకు తీశారు. దానిని శుభ్రం చేసి సదరు మహిళా ప్రయాణికురాలికి అప్పగించారు. తన ఉంగరం మళ్లీ దొరుకుతుందని ఊహించని ఆ మహిళ, రైల్వే సిబ్బందికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వివరాలు సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో నిమిషాల్లో వైరల్‌గా మారాయి. భారతీయ రైల్వే సిబ్బంది పనితీరు అమోఘం, మురికిని కూడా లెక్కచేయకుండా ప్రయాణికురాలి ఆవేదనను అర్థం చేసుకున్న సిబ్బందికి సెల్యూట్ అంటూ నెటిజన్లు సదరు రైల్వే ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రైల్వే శాఖ కూడా తమ సిబ్బంది సమయస్ఫూర్తిని, సేవా భావాన్ని అభినందించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?