AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సింగర్‌పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు! వైరల్ అవుతున్న వీడియో

కళాకారులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శిస్తే ప్రేక్షకులు చప్పట్లతో, సన్మానాలతో గౌరవించడం సహజం. కానీ, గుజరాత్‌లో జరిగిన ఒక భజన కార్యక్రమంలో మాత్రం ఓ గాయకుడిపై అభిమానులు ఏకంగా నోట్ల వర్షం కురిపించారు. ఒకరిద్దరు కాదు, అక్కడ ఉన్న భక్తులంతా పోటీపడి మరీ డబ్బుల సంచులను వేదికపైకి విసిరేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

Viral Video: సింగర్‌పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు! వైరల్ అవుతున్న వీడియో
Fans Throw Money On Singer
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 16, 2026 | 10:07 AM

Share

ఏ కళాకారుడైనా గొప్పగా తన కళను ప్రదర్శిస్తే చప్పట్లు కొట్టి మెచ్చుకుంటారు. అలాగే ఏ గాయకుడైనా గొప్పగా పాట పాడారంటే సన్మానాలు, సత్కారాలతో పొగుడుతూ ప్రశంసలు కురిపిస్తారు. అయితే.. ఇక్కడ జరిగిన ఓ సంఘటనలో మాత్రం ఓ గాయకుడిపై నోట్ల వర్షం కురిపించారు. వినడానికి వింతగా ఉన్న ఇది అక్కడ ఓ సంప్రదాయంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు, ఇలా ఇష్టారీతిన డబ్బులు వెదజల్లడం వివాదానికి సైతం దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఈ సంఘటన ఆశ్చర్యపోయేలా చేస్తుందని, చాలా వింతగా ఉందంటూ చర్చించుకుంటున్నారు.

గుజరాత్‌ రాష్ట్రంలో లోక్ దిరో’ ఓ ప్రాముఖ్యత ఉంది. లోక్ దిరో అంటే భజనలకు సంబంధించిన కార్యక్రమం. ఇటీవల జూనాగఢ్‌లోని మాలియా హటీనాలో నిర్వహించిన దియారే కార్యక్రమంలో ప్రముఖ భజన గాయకుడు జిగ్నేశ్ కవిరాజ్‌పై డబ్బుల సంచులు విసిరిన ఘటన చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం.. అన్ని భజన కార్యక్రమాల మాదిరిగా కాకుండా అక్కడ చూపరులు ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయేలా ఓ సంఘటన జరిగింది. అవుతోంది. అదేంటంటే.. జిగ్నేష్ కవిరాజ్ శ్రీకృష్ణుడు, స్నేహం గురించి భజనలను రాగయుక్తంగా పాడుతుంటే భక్తిలో మునిగిపోయిన భక్తులు ఆయనపై నోట్ల వర్షం కురిపించారు. అది కూడా సాధారణ రీతిలో కాదు.. ఏకంగా ఆ నోట్లతో ఆయన మునిగిపోయే రీతిలో. అయినప్పటికీ, ఈ పరిణామాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా భజనలు పాడటం కొనసాగించారు. ఇప్పుడు ఈ ఘటన అత్యంత చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, అదే కార్యక్రమంలో మాయాభాయ్ అహీర్ కుమారుడు జయరాజ్ అహీర్ సైతం డబ్బులు విసిరినట్లు వార్తలు హల్చల్ చేశాయి.

అసలేం జరిగిందంటే.. ఖంభాలియాలో ప్రయాగ్‌రాజ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇటీవల భజన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా దియారే ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ భజన గాయకుడు కవిరాజ్ జిగ్నేశ్ విశిష్ట అతిథిగా విచ్చేసి భజనలు ఆలపించారు. భగవద్ జ్ఞాన యజ్ఞం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శ్రోతలు ఈ లోకాన్నే మర్చిపోయేలా ఆయన అద్భుతంగా భజన కొనసాగిస్తుండగా, అది విని భక్తి పారవశ్యంలో మునిగిపోయి అక్కడున్న ప్రేక్షకులు మొదట నోట్లను విసిరారు. ఆపై మరింత ఉత్సాహంగా సాగడంతో ఏకంగా డబ్బుల సంచులనే వేదికపైకి విసిరడంతో ఆ ప్రాంతం కాసేపు అల్లకల్లోలంగా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. జిగ్నేష్ కవిరాజ్ పాడటం ప్రారంభించిన వెంటనే అక్కడ గుమిగూడిన భక్తుల సమూహం ఒక్కసారిగా వేదిక వైపు కదిలారు. ఆ తర్వాత ఒక్కసారిగా తమ వెంట తెచ్చుకున్న సంచుల నుంచి నోట్లను గాలిలోకి విసరడం ప్రారంభించారు. దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల పాటు సాగిన ఈ దియారే కార్యక్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు విసిరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ మొత్తం డబ్బును ధార్మిక కార్యక్రమాల కోసమే విరాళంగా ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అయితే.. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు దీనిని ఒక గొప్ప సంప్రదాయంగా ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆ డబ్బు కేవలం ప్రదర్శన కోసమేనని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్న ఓ ధార్మిక కార్యక్రమంలో ఈ విధంగా డబ్బులు వెదజల్లడం మంచి చర్య కాదని పలువురు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?