Ramba: వాటే మేకోవర్ భయ్యా.. రంభ కూతురు ఎంత మారిపోయిందో చూశారా.. ? లుక్కు చూస్తే దిమాక్ కరాబ్..
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్ రంభ గుర్తుందా.. ? బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. తెలుగు, తమిళ భాషలలో అగ్ర కథానాయికగా రాణించిన ఆమె.. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్న ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రంభ గుర్తుందా.. ? ఒకప్పుడు తెలుగులో ఆమె తోపు హీరోయిన్. కేవలం 16 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలతో జతకట్టింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో అనేక సినిమాలు చేసింది. అటు నటనతోపాటు ఇటు గ్లామరస్ లుక్స్ లోనూ కట్టిపడేసింది. గణేష్, భైరవద్వీపం వంటి చిత్రాలనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అల్లు అర్జున్, పూరి కాంబోలో వచ్చిన దేశముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ సైతం చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా తన పెద్ద కూతురుతో కలిసి షేర్ చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటుంది. అందులో రంభ కూతురిని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఎక్కువ మంది చదివినవి : Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..
తల్లీకూతుళ్లిద్దరూ తమ అద్భుతమైన దుస్తులలో ఎంతో హుందాగా కనిపించారు. రంభ షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ పై అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రంభ కూతురు తల్లిని మించిన అందంతో ఎంతో క్యూట్ గా ఉందని.. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..
2010లో, రంభ కెనడాలో నివసిస్తున్న శ్రీలంక తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత, ఆమె తమిళ టీవీ షో ‘మానద మయిలద’ తెలుగు డ్యాన్స్ షో ‘ఢీ’ వంటి రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా పాల్గొంది. ఈ దంపతులకు లావణ్య, సాషా , శివిన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రంభ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆట సినిమాలో ఇలియనానను పెట్టుకున్నానని ఆ హీరోయిన్ అలిగింది.. నిర్మాత ఎం ఎస్ రాజు..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..
