AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆట సినిమాలో ఇలియనానను పెట్టుకున్నానని ఆ హీరోయిన్ అలిగింది.. నిర్మాత ఎం ఎస్ రాజు..

నిర్మాత ఎం.ఎస్. రాజు తెలుగు హీరోయిన్ తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆట చిత్రంలో ఇలియానా ఎంపికపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలుగులో ఎంఎస్ రాజు నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు.

Tollywood : ఆట సినిమాలో ఇలియనానను పెట్టుకున్నానని ఆ హీరోయిన్ అలిగింది.. నిర్మాత ఎం ఎస్ రాజు..
Ms Raju
Rajitha Chanti
|

Updated on: May 15, 2026 | 11:49 AM

Share

నిర్మాత ఎం.ఎస్. రాజు ఓ ఇంటర్వ్యూలో నటి త్రిషతో తనకున్న అనుబంధాన్ని, అలాగే ఇలియానా, శ్రీహరి వంటి ప్రముఖ నటులతో తన అనుభవాలను పంచుకున్నారు. ఒక హీరోయిన్ తన డేట్‌లను ఒక నిర్మాతకు అప్పగించి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పడం సాధారణంగా జరగదని, కానీ త్రిష తన విషయంలో అలానే వ్యవహరించిందని ఎం.ఎస్. రాజు వివరించారు. ఆయనకు త్రిష అంటే ప్రాణం అని, ఆమె తనను ఒక దేవుడిలా చూసుకునేదని పేర్కొన్నారు. మొదట్లో ఆమె ముఖం అర్జున్ చిత్రానికి సరిపోదని అన్నారని.. అప్పట్లో ల్యాప్‌టాప్‌లు లేని రోజుల్లో, మహేష్ బాబు దగ్గర త్రిష ఫోటోలను చూసి, ఆమె బాగుందని అనిపించిందని చెప్పుకొచ్చారు. అయితే, డైరెక్టర్ ఆమె క్యారెక్టర్‌కు సూట్ అవ్వదని చెప్పారు. అయినా తాను త్రిషను కలవాలని నిశ్చయించుకున్నారు. త్రిష ఆ సమయంలో ఒక డిజెక్షన్ లో ఉన్నట్టుందని, తన ఫోన్ రాగానే ఆనందపడిందని తెలిపారు. ఆమె నివాసానికి వెళ్లి, వర్షం కోసం ఎంపిక చేశారు. ఆ రోజు త్రిష తల్లి ఉమ కూడా సినిమా పట్ల ఆసక్తి చూపారని గుర్తుచేసుకున్నీరు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

వర్షం షూటింగ్‌లో త్రిష అంకితభావం అపారమని గుర్తు చేసుకున్నారు. 75 రోజుల పాటు వర్షంలో తడస్తూ షూటింగ్ చేయాల్సి వచ్చింది. కొన్ని క్లిష్టమైన సన్నివేశాల్లో “నా వల్ల కాదు” అని ఏడ్చినప్పటికీ, తాను ప్రోత్సహించగా, “నేను చేస్తాను” అని దృఢంగా నిలబడిందని గుర్తు చేసుకున్నారు.. ఆ సినిమా అసోసియేట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి వర్షం సన్నివేశాలకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఈ సినిమాతో త్రిష రాజు కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి త్రిషను మొదటగా అనుకోలేదని.. అయితే, త్రిష స్వయంగా ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా తన ఇంటికి వచ్చి, భోజనం చేసి, స్క్రిప్ట్ బుక్ తీసుకుని, డేట్‌లు అడిగిన మొట్టమొదటి నటిగా నిలిచిందని అన్నారు. ఒక ఆంగ్ల పత్రిక రాత్రి మూడు గంటలకు ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడతారని అడిగినప్పుడు, త్రిష ఎం.ఎస్. రాజు పేరును మాత్రమే చెప్పింది.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఆట చిత్రంలో ఇలియానాను హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పుడు త్రిష అలిగిందని, షూటింగ్‌కు వస్తానని ఫోన్లు చేసిందని చెప్పారు. అయితే, అప్పటికే షూటింగ్ రాజమండ్రిలో బోటు మధ్యలో మొదలైందని, ఆపలేనని చెప్పడంతో త్రిష శాంతించిందని వివరించారు. తాను తన నటీనటులను ఇంట్లో పిల్లల్లా చూసుకునేవాడినని, అందుకే వారికి తనంటే అంత అభిమానమని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు