AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో పిల్లలకు బెస్ట్ హెల్తీ ఫుడ్.. ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్ చేసి పెట్టండి

వేసవికాలంలో పిల్లలకు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌ల బదులుగా ఇంట్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన స్వీట్‌ను తయారు చేసే పెట్టండి. మీరు ఈ స్వీట్ ను చేసుకున్న తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. మంచి క్రీమీ టెక్స్చర్, లోపలి కొబ్బరి స్టఫింగ్‌తో కూడిన ఈ రుచికరమైన స్వీట్ మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: May 16, 2026 | 11:24 AM

Share
వేసవికాలంలో పిల్లలకు ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్ వంటి అన్‌హెల్తీ ఫుడ్స్ కు బదులుగా ఇంట్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన స్వీట్‌ను తయారుచేయవచ్చు. ఈ స్వీట్ తయారీకి అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలనే వాడి చేయవచ్చు. ముందుగా, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడితో స్టఫింగ్‌ను సిద్ధం చేసుకోవాలి.

1 / 5
ముందుగా, స్వీట్ లోపలి స్టఫింగ్ కోసం అర కప్పు తురిమిన బెల్లాన్ని స్టవ్ మీద కడాయిలో వేసి లో ఫ్లేమ్‌లో కరిగించుకోవాలి. నీళ్లు వేయకుండానే బెల్లం సులభంగా కరుగుతుంది. బెల్లం కరిగిన తర్వాత, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము,  యాలకుల పొడి వేసి బాగా కలపాలి. కొబ్బరిలోని తడి పోయి, మిశ్రమం గట్టిపడే వరకు లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించుకోవాలి.

2 / 5
తేమ ఎక్కువగా ఉంటే బియ్యం పిండి తడిచిపోయి స్టఫింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈ మిశ్రమం సిద్ధమైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత, బయటి కవరింగ్ కోసం ఒక కప్పు పొడి బియ్యంపిండిని మిక్సింగ్ బౌల్‌లో తీసుకోవాలి. బాగా మరుగుతున్న వేడి నీళ్లను కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడు చేత్తో బాగా ఒత్తుతూ కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు, స్టవ్ మీద అడుగు మందంగా ఉండే  కడాయి పెట్టి ఒక లీటరు చిక్కటి పాలు తీసుకోవాలి. ఈ స్వీట్‌కు వెన్న తీయని చిక్కటి పాలు అయితేనే రుచిగా ఉంటాయి. డైట్ చేసేవారు ఫ్యాట్ లేని పాలు వాడుకోవచ్చు. పాలలో కొద్దిగా పటికబెల్లం ముక్కలు వేసి, మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ కాగనివ్వాలి. హెల్తీగా చేయడం కోసం పటికబెల్లం వాడారు, కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు.

4 / 5
స్టఫింగ్ బాల్స్ వేసిన తర్వాత, ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించగానే అవి పైకి తేలుతాయి. ఒకసారి కలిపి, మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ దాదాపు పావు గంట పాటు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ బియ్యంపిండిని ఉండలు లేకుండా కలిపి, ఈ పాలలో వేసుకోవాలి. తరువాత, అర స్పూన్ యాలకుల పొడి వేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. పాలు దగ్గరగా మరిగి, బియ్యం పిండి నీళ్లు చక్కగా ఉడికి, స్వీట్ చిక్కబడుతుంది. ఇది మరీ గడ్డలాగా చిక్కబడకుండా చేసుకోవాలి. చక్కగా తయారైన ఈ స్వీట్‌ను చల్లగా సర్వ్ చేసుకోవచ్చు

5 / 5
Follow Us