AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సిటీలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉండదు.. 99శాతం మందికి దీన్ని గురించి తెలియదు

రెడ్, గ్రీన్, ఎల్లో.. ఈ మూడు రంగుల సిగ్నల్స్ లేకుండా ఏ నగరమైనా ఉంటుందా? అంటే ఉంటుందని చెబుతోంది రాజస్థాన్‌లోని ఈ నగరం. ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకుండా భారీ రద్దీని అక్కడ ఎలా నియంత్రిస్తున్నారు? అసలు ఈ మూడు రంగుల సిగ్నల్ ఎప్పుడు ప్రారంభమైంది? వంటి ఆశ్చర్యకరమైన నిజాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈ సిటీలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉండదు.. 99శాతం మందికి దీన్ని గురించి తెలియదు
Which City Has No Traffic Signals
Krishna S
|

Updated on: May 15, 2026 | 12:20 PM

Share

ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఏ చిన్న నగరం వెళ్లినా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిమిషాల తరబడి వేచి చూడటం మనకు అలవాటే. ఎరుపు రంగు పడగానే ఆగడం, ఆకుపచ్చ రాగానే ముందుకు వెళ్లడం నిత్యకృత్యం. అయితే ప్రపంచంలో కొన్ని నగరాలు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి లేకుండానే ట్రాఫిక్‌ను అద్భుతంగా నియంత్రిస్తున్నాయి. అవేంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..

99 శాతం మందికి తెలియని ఆ నగరాలు?

సాధారణంగా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల దగ్గరకు వచ్చేసరికి మనకు తెలిసినవే అనిపిస్తాయి కానీ సమాధానం చెప్పేటప్పుడు తికమక పడతాం. “ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని నగరం ఏది?” అని అడిగితే చాలా మంది ఆలోచనలో పడతారు.

థింఫు (భూటాన్): ప్రపంచంలో ట్రాఫిక్ లైట్లు లేని మొట్టమొదటి రాజధాని నగరం భూటాన్‌లోని థింఫు. ఇక్కడ సిగ్నల్స్‌కు బదులుగా పోలీసులు చేతితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. అది కూడా ఒక కళాత్మక నృత్యంలా కనిపిస్తుంది.

కోటా: మన దేశంలోని రాజస్థాన్‌కు చెందిన కోటా నగరం ఇప్పుడు సిగ్నల్ ఫ్రీ సిటీగా రికార్డు సృష్టించింది. ఒకప్పుడు విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లతో సతమతమైన ఈ నగరం, నేడు ఒక్క సిగ్నల్ కూడా లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లేలా రూపుదిద్దుకుంది.

కోటా నగరం ఎలా సాధ్యం చేసింది?

కోటా అర్బన్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ గత కొన్ని ఏళ్లుగా ప్రణాళికాబద్ధంగా చేసిన మార్పులే దీనికి కారణం. గతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఎయిర్‌పోర్ట్ జంక్షన్, అనంతపుర జంక్షన్ వంటి కీలక ప్రాంతాల్లో సిగ్నళ్లను తొలగించి, వాటి స్థానంలో రౌండ్‌అబౌట్‌లు అండర్ పాస్‌లను నిర్మించారు. వాహనాల వేగం తగ్గకుండా ఉండేందుకు రోడ్లను విస్తరించారు. ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్ల ద్వారా వాహనాలు ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా నిరంతర ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు.

ట్రాఫిక్ లైట్ల వెనుక చిన్న చరిత్ర

మనం ప్రతిరోజూ చూసే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ సిగ్నల్స్ వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. మొదట్లో కేవలం రెడ్, గ్రీన్అనే రెండు రంగులు మాత్రమే ఉండేవి. 1921లో విలియం పాట్స్ అనే వ్యక్తి మూడు రంగుల సిగ్నల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండటానికి ఆయన పసుపు రంగును చేర్చారు. అప్పటి నుండి ఈ మూడు రంగుల విధానం ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.

పరీక్షలకు ఉపయోగపడే మరికొన్ని అంశాలు..

మొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్: 1914లో అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేశారు.

భారతదేశంలో మొదటి సిగ్నల్: 1953లో చెన్నైలో మొదటిసారిగా ట్రాఫిక్ సిగ్నల్‌ను ఏర్పాటు చేశారు.

జ్ఞానానికి అంతం లేదు. మనం నిత్యం చూసే చిన్న చిన్న విషయాల వెనుక కూడా ఎంతో గొప్ప సమాచారం దాగి ఉంటుంది. కోటా మరియు థింఫు వంటి నగరాలు చూపిస్తున్న ఈ బాట, భవిష్యత్తులో మిగిలిన నగరాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.

Follow Us