Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 8-19 తేదీల మధ్య 77 రైళ్లు రద్దు.. 5 ఆలస్యం
Indian Railways: భారత రైల్వే.. ప్రతి రోజు రైళ్ల ద్వారా లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. అయితే ట్రాక్ పనులను, ఇతర కారణాల వల్ల పలు రైళ్లు రద్దువుతుంటాయి. అలాంటి రైలు ప్రయాణం చేసేవారు పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది. వచ్చే నెల 8 నుంచి19వ తేదీన దేశంలో పలు ప్రాంతాల్లో 77 రైళ్లు రద్దు కానున్నాయి..

Indian Railways: జూన్ నెలలో వివిధ తేదీలలో ఛత్తీస్‌గఢ్ గుండా వెళ్లే 77 రైళ్లను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. బిలాస్‌పూర్ రైల్వే డివిజన్‌లోని చంపా స్టేషన్‌లో నాలుగో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే శాఖ ప్రకారం, జూన్ 7 నుండి జూన్ 19 మధ్య 65 ఎక్స్‌ప్రెస్, 12 ప్యాసింజర్ రైళ్లపై దీని ప్రభావం ఉంటుంది. ఇది కాకుండా, 8 రైళ్లు మార్చబడిన మార్గాల్లో నడుస్తాయి. 6 రైళ్లు వాటి గమ్యస్థానానికి ముందే నిలిచిపోనున్నాయి. అలాగే 5 రైళ్లు ఆలస్యంగా నడువనున్నాయి.
7 రాష్ట్రాలపై ప్రభావం
ఈ నిర్ణయం ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా 7 రాష్ట్రాల ప్రయాణికులపై ప్రభావం చూపుతుంది. వేసవి సెలవుల్లో, వేసవి కాలంలో రైళ్లను రద్దు చేయడం వల్ల ప్రయాణికుల ఇబ్బందులు పెరగవచ్చు. ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు, హస్‌డియో ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా ప్యాసింజర్ రైలుగా నడపాలని రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. జూన్ 8వ తేదీ నుండి 19వ తేదీ వరకు, కోర్బా-రాయ్‌పూర్ హస్‌డియో ఎక్స్‌ప్రెస్ కేవలం కోర్బా, బిలాస్‌పూర్ మధ్య మాత్రమే ప్యాసింజర్ సర్వీస్‌గా నడుస్తుంది.
ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
హౌరా-పుణె దురంతో సిఎస్‌ఎమ్‌టి-హౌరా దురంతో, జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను రాయ్‌పూర్, టిట్లాగఢ్, ఝార్సుగూడ మీదుగా మళ్లిస్తారు. ఛత్తీస్‌గఢ్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-కోర్బా లింక్ ఎక్స్‌ప్రెస్, గోండ్వానా ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను మార్గమధ్యంలోనే నిలిపివేస్తారు. ప్రయాణానికి ముందు తమ రైలు స్థితిని తనిఖీ చేసుకోవాలని రైల్వే ప్రయాణికులను కోరింది.
రైల్వే లైన్ల పనులు
ఆగ్నేయ మధ్య రైల్వేలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా, బిలాస్‌పూర్, ఝార్సుగూడ మధ్య మూడవ, నాల్గవ రైల్వే లైన్లను వేస్తున్నారు. ఈ మార్గం చాలా రద్దీగా ఉంటుంది. ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశంతో కలుపుతుంది. కొత్త లైన్ నిర్మాణం రైళ్ల రాకపోకలను సులభతరం చేస్తుందని, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడానికి వీలు కల్పిస్తుందని, అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తుందని రైల్వే పరిపాలన వర్గాలు పేర్కొన్నాయి. అదనంగా, రైళ్లు సమయానికి నడుస్తాయి. ఆలస్యం తగ్గుతుంది.
180 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తయ్యాయి
బిలాస్‌పూర్ – ఝార్సుగూడ మధ్య 206 కిలోమీటర్ల పొడవైన నాల్గవ రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నట్లు రైల్వే పరిపాలన విభాగం తెలిపింది. ఇప్పటివరకు 180 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కింద బిలాస్‌పూర్-ఝార్సుగూడ సెక్షన్‌లోని చంపా స్టేషన్‌ను కూడా నాల్గవ రైల్వే లైన్‌కు అనుసంధానించనున్నారు.
ఇది కూడా చదవండి: Chanakya Niti: చాణక్య నీతి.. నిజమైన శత్రువులు ఎవరు? ఈ 5 గురితో పెట్టుకుంటే సర్వనాశనమే.. వీరితో జాగ్రత్తగా ఉండండి.!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




