AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudhakar: సినిమా ఇండస్ట్రీలో నా ప్రాణ మిత్రులు వీరే.. ఏ కష్టమొచ్చినా ‘ఆ నలుగురు’ కి మాత్రమే ఫోన్ చేస్తా

కెరీర్ ప్రారంభంలో హీరోగా ఓ వెలుగు వెలిగారు సుధాకర్. ఆ తర్వాత కమెడియన్ గానూ, విలన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పించారు. ఎన్నో వందల చిత్రాల్లో నటించి మెప్పించిన సుధాకర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూల్లో కనిపిస్తుంటారు.

Sudhakar: సినిమా ఇండస్ట్రీలో నా ప్రాణ మిత్రులు వీరే.. ఏ కష్టమొచ్చినా 'ఆ నలుగురు' కి మాత్రమే ఫోన్ చేస్తా
Sudhakar
Basha Shek
|

Updated on: May 15, 2026 | 11:54 AM

Share

నటుడు సుధాకర్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవికి ప్రాణమిత్రుడైన ఆయన సుమారు 600కు పైగా సినిమాల్లో నటించారు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోగా నటించిన సుధాకర్ ఆతర్వాత కమెడియన్ గా, విలన్ గా, సహాయక నటుడిగా ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ నటించారు సుధాకర్. తన నటనా ప్రతిభకు ప్రతీకగా రెండు సార్లు నంది పురస్కారం కూడా అందుకున్నారు. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు సుధాకర్. చివరిగా 2009లో నితిన్ హీరోగా నటించిన ద్రోణ సినిమాలో కనిపించారు సుధాకర్. అంటే ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపించక సుమారు 17 ఏళ్లు అవుతోంది. వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్య పరిస్థితులతో సుధాకర్ బాగా బక్కచిక్కిపోయారు.  బ్రెయిన్ స్ట్రోక్ రావ‌డంతో ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. దీంతో సుధాకర్ బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. అయితే అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కనిపించారు. అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో ను పాల్గొన్నారు.

కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుధాకర్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో తన ప్రాణమిత్రులెవరో చెప్పుకొచ్చారు. ‘ నా ప్రాణమిత్రుడు చిరంజీవి, హీరో జగపతి బాబు, ఆర్టిస్టు చిన్న, తనికెళ్ల భరణి.. సినిమా ఇండస్ట్రీలో నా ప్రాణమిత్రులు వీరే. ఈ నలుగురు ఎప్పుడూ నాకు విలువ ఇస్తారు. నా పరిస్థితి ఎలా ఉన్నా నాతో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. ఏ రాత్రి ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుని నాకు కావాల్సిన సహాయం చేస్తారు. ఇప్పటికీ నాకు ఏదైనా అవసరమైతే వీరినే అడుగుతాను. కానీ ప్రస్తుతం నా పరిస్థితి బాగానే ఉంది. అందుకే అంత అవసరమైతే పడడం లేదు’ అని చెప్పుకొచ్చారు.

నా కోరిక నెరవేరుతుందో? లేదో?

కాగా సుధాకర్ తన కుమారుడు బెనెడిక్ట్ మైఖేల్‌ (బెన్నీ)ని నటుడిగా చూడాలనుకుంటున్నారు. ఆ మధ్యన అతను సినిమాల్లోకి వస్తున్నాడని ప్రచారం కూడా జరిగింది. అయితే అదేమీ జరగలేదు. దీంతో తన కొడుకుని నటుడుగా చూడాలని తన కోరిక నెరవేరుతుందా లేదా అనే బాధ మాత్రం ఉండిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుధాకర్. కాగా రెండేళ్ల క్రితం సుధాకర్ కుమారుడి పెళ్లి ఘనంగా జరిగింది. నటుడు బ్రహ్మానందం దగ్గరుండి మరీ ఈ పెళ్లి పనులు చూసుకున్నారు. అలాగే జ‌గ‌ప‌తి బాబు, బ్ర‌హ్మానందం, జేడీ చక్రవర్తి, రోజా రమణి, చంద్ర‌బోస్ దంప‌తులు సహా పలువురు సెలబ్రెటీలు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us